Argentina coma mother meets son 4 months later | కోమాలోనే బిడ్డను కని.. 4 నెలల తర్వాత...

Woman who delivered while in a coma wakes up

Argentina, Argentina Woman, Argentina Mother, Argentina Coma Mother, Coma Woman, Coma Woman Birth, Amelia Banna, Amelia Banna Son, Coma Mother Story, Argentina Coma Police, Argentina Woman Cop, Woman Coma Cop, Coma Cop Birth, Coma Mother Meet Baby, Argentina coma mother

Woman in Argentina who nearly died in a horrific car crash wakes up 'thanks to baby she gave birth to in coma. Amelia Banna a 34 years police officer was five months pregnant when she had a serious traffic accident. She gave birth over Christmas while still in a coma. Her family brought the child to the hospital and three months later she woke up.

ఇదో అరుదైన అమ్మ కథ...

Posted: 04/21/2017 01:32 PM IST
Woman who delivered while in a coma wakes up

మమకారం అనే మాయ ఆ తల్లి, బిడ్డల ప్రాణాలను నిలబెట్ట గలిగింది. ఓ యాక్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడిన మహిళ, కోమాలోనే ప్రసవించ, ఆపై నాలుగు నెలల తర్వాత తన బిడ్డను చూసుకోగలిగింది. అర్జెంటీనాలోని 34 ఏళ్ల బన్నాన్ అనే మహిళ విషయంలో జరిగిన ఉదంతం.

మహిళా పోలీసు అధికారి అయిన అమెలియా బన్నన్‌ గత ఏడాది నవంబర్‌ 1న ప్రమాదానికి గురైంది. ఆమె పోలీసు అధికారి అయిన తన భర్త, సహోద్యోగులతో కలిసి సర్వీసు వాహనంలో ప్రయాణిస్తుండగా రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బన్నన్‌ కోమాలోకి వెళ్లింది. అప్పటికే ఆమె గర్భవతి కావటంతో వైద్యులు చాలా జాగ్రత్తగా ఆమెను చూసుకున్నారు.

కోమాలో ఉండగానే నాలుగు నెలల కిందట ఆమె పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డకు శాంటినో అని పేరు కూడా పెట్టేసి అతని ఆలనా పాలనా బన్నన్ సోదరి చూస్తూ వస్తోంది. రోజూ సాయంత్రం ఆ బిడ్డను తల్లికి దగ్గరగా తీసుకెళ్లినప్పటికీ, ఆమె మాత్రం చలనం లేకుండా అలానే పడి ఉంది. కానీ, కొన్ని రోజులుగా ఆమెలో కదలికలు కనిపించటం, చివరకు గత గురువారం అనూహ్యంగా ఆమె కోమాలోంచి బయటపడటం జరిగిపోయాయి. తలకు బలంగా దెబ్బ తగిలినప్పటికీ ఆమె బతికుండటం నిజంగా ఆశ్చర్యకరమని వైద్యులు చెబుతున్నారు.

ఏదైతేనేం బిడ్డ పుట్టిన నాలుగు నెలల తర్వాత ఈ లోకంలోకి వచ్చిన ఆ తల్లికి జరిగిన విషయాలు సరిగ్గా గుర్తు రానప్పటికీ, బిడ్డను చూసుకున్న ఆ మధుర క్షణం గుర్తుండిపోవాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Argentina  Coma Woman  Meet Baby  

Other Articles