TDP government acts against Social Media trolls టీడీపీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు.. మండిపడుతున్న నెట్ జనులు

Tdp government acts against social media trolls

Ravi kiran, political punch, political punch Ravi kiran, lokesh trolled in social media, AP IT minister nara lokesh trolled in social media, nara lokesh jail, nara lokesh jail bars, troll, social media, whatsapp, facebook, twitter, TdP, telugu desam, Nara Lokesh, Chandrababu Naidu, Andhra pradesh, politics

As anticipated Nara Lokesh, TDP government is sick of the trolls and has acted against them. The Tulluru police detained inturi Ravi kiran, the Administrator of Facebook page “Political Punch”.

టీడీపీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు.. మండిపడుతున్న నెట్ జనులు

Posted: 04/21/2017 01:12 PM IST
Tdp government acts against social media trolls

టీడీపీ పార్టీ, తమపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. తమ పార్టీ నేతలను, మరీ ముఖ్యంగా నారా లోకేష్ ను టార్గెట్ చేసి.. ఆయన నోరుజారడాన్ని అదునుగా తీసుకుని వాటిపై జోక్స్ వేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో పాటు నెట్ జనులకు కాసింత కామెడీని జత చేసిన రాజకీయ విషయాలను సైటెరికల్ గా అందిస్తున్న పోలిటికల్ పంచ్ అధినేత రవికిరణ్ ను అంధ్రప్రదేశ్ తూళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రవికిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే రవికిరణ్ అరెస్టుపై ఆయన కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించలేదని, వేకువ జామున విజయవాడుకు బయలుదేరి వెళ్తున్న వ్యక్తిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారని.. తన భర్తను అసాంఘిక శక్తి తరహాలో ట్రీట్ చేసీ మరీ తీసుకెళ్లడంపై అయన భార్య సుజన అందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో పాటు వెబ్ సైట్లలో టీడీపీ పార్టీకి, పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం జరగకుండా అడ్డకట్ట వేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న దిద్దుబాటు చర్యల్లో భాగంగా రవికిరణ్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా, ఇది కేవలం టీడీపీని, పార్టీ అధినేత, అధినేత కుమారుడు లోకేస్ ను టార్గెట్ చేయడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగుకు తెగులు పట్టిస్తున్న నేతలపై సెటైర్లు వేస్తే తప్పేముందని నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు. బీకాం లో ఫిజిక్స్, మాథ్య చదివిన నేతల గురించి సైట్లరు వేసుకునే హక్కు కూడా నెట్ జనులకు లేదాజ..? అని ప్రశ్నిస్తున్నారు. భక్తి శ్రద్తలకు శ్రద్దాంజలికి తేడా కూడా తెలియని నేతలు.. శ్రద్దాంజలికి శుభాకాంక్షలు తెలిపే రాజకీయ పరిపక్వత లేని నేతలను గురించి తమ స్నేహితులతో అభిప్రాయాలు పంచుకోవడంలో తప్పముందన్న వాదనలు కూడా నెట్ జనులు తెరపైకి తెస్తున్నారు.

ఇక మరికోందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తమనెరిగిన వారితో నిస్పందేహంగా పంచుకుంటాం అలాంటప్పుడు వాటిపై చర్యలు తీసుకోవడమేమిటన్న వాదనలు కూడా నెట్ జనులు వినిపిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీపై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వస్తుంటే.. ఆయన వాటిని చాలా లైట్ గా తీసుకుంటున్నారని, తన పనులతో తాను గోప్ప నేతను అనిపించుకుంటున్నారే తప్ప.. నెట్ జనులపై ఏ రోజు మండిపడలేదన్న సూచనలు వస్తున్నాయి. తనపై జోకులు వేసుకుని నవ్వేకునే వారు నవ్వుకోవచ్చంటూ కూడా రాహుల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మరీ టీడీపీ నేతలకు మాత్రం కత్తి నూరడమేంటని నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాపై కూడా ప్రభుత్వాలు నియంత్రన కొనసాగించాలన్న దురుద్దేశపూరితమైన అలోచనలకు స్వస్తి పలకాలని కూడా పలువురు నెట్ జనులు సూచిస్తున్నారు. టీడీపీ ఇలాంటి పరిస్థితులనే కొనసాగిస్తే.. నెట్ జనులను తమ పార్టీ దూరం చేసుకుంటుందనడంలో సందేమేమీ లేదని, దీంతో వారికి జరిగే నష్టమే అధికమంటున్నవారు కూడా లేకపోలేరు. సోషల్ మీడియా అంటే ప్రస్తుతం ఒక విప్లవమని దాని జోలికి వెళ్లకపోవడం ప్రభుత్వాలకు మంచిదని కూడా నెట్ జనులు సూచనలు చేస్తున్నారు. మరి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు టీడీపీకి లాభిస్తాయో.. లేక నష్టాన్ని మిగులుస్తాయోనన్న వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi kiran  political punch  AP IT minister  nara lokesh  Chandrababu naidu  

Other Articles

Today on Telugu Wishesh