హేమమాలిని, నితిన్ గడ్కారీలపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Hema Malini drinks, has she killed herself? Maharashtra MLA asks

Hema malini drinks has she killed self asks maharashtra mla

Hema Malini, Maharashtra, Farmers suicide, bacchu kadu, nitin gadkari, farmer suicides, uttar pradesh, PM modi, BJP, amaravati(maha), alcohol, politics

Maharashtra Independent MLA Bacchu Kadu courted controversy after he dragged Hema Malini into a row over farmers' suicide asks she drinks everyday, but does she commit suicide?" Kadu said addressing a press conference in Nanded district.

హేమమాలిని మద్యం తాగుతారంటూ..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Posted: 04/14/2017 12:22 PM IST
Hema malini drinks has she killed self asks maharashtra mla

మద్యానికి బానిసలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న అధికార సభ్యుల వాదనలతో ఏకీభవించిన మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే బచ్చుకదు.. బీజేపి ఎమ్మెల్యేలకు దిమ్మదిరిగే షాకింగ్ కామెంట్స్ చేసి ఏకంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. రైతు ఆత్మహత్యలపై అధికార బీజేపి చేసిన కామెంట్లను ఆయన తీవ్రస్థాయిలో ఖండిస్తూ.. రోజు మద్యం తాగి అన్నదాతలు అత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలను ఖండిస్తూ.. ఆ విషయానికి వస్తే ప్రతిరోజు మద్యం తాగే వారి సిపీనటులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని ప్రశ్నించారు.

అంతటితో అగకుండా ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది రోజూ మందు కొట్టేవారేనని, పాత్రికేయుల్లో అత్యధికులు మద్యం సేవిస్తారని తెలిపిన ఆయన, మరో అడుగు ముందుకేసి బాలీవుడ్ డ్రీమ్ గాళ్.. మధుర పార్లమెంటు సభ్యురాలు హెమామాలినిని కూడా ఈ వివాదంలోకి లాగారు. ‘‘ ఏం హేమమాలిని రోజు మధ్యం తీసుకోరా..? అంతమాత్రాన అమె ఆత్మహత్య చేసుకున్నారా’’ అన్ని ప్రశ్నించారు. అప్పటికీ శాంతించని బచ్చుకదు.. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కూడా ఈ అంశంలోకి లాగారు. గడ్కారీ కుమారుడి పెళ్లికి ఏకంగా నాలుగు కోట్లు రూపాయలు ఖర్చైయ్యందని అప్పట్లో మీడియా వెల్లడించింది. అయితే ఆయన ఫఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటారా..? అని వేచిచూస్తమా..? అని కూడా ప్రశ్నించారు.

అన్నదాతల అత్మహత్యల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలాంటి కారణాలను చెప్పడం ప్రభుత్వానికి సహేతుకం కాదని అన్నారు. ప్రభుత్వ నిజంగా చిత్తశుద్దితో వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముందుగా రైతుల ఆత్మహత్య కారణాలపై విచారణ చేపట్టాలని, అంతకన్నా ముందు అన్నదాతల రుణాలను మాఫీ చేయాలని బచ్చుకదు డిమాండ్ చేశారు. ఒక్కో రాష్ట్రంలో అన్నదాదలను ఒక్కో విధంగా బీజేపి ప్రభుత్వ చేస్తుందని ఉత్తర్ ప్రదేశ్ లో రైతు రుణాలను మాఫీ చేసిన బీజేపి సర్కార్ ఇక్కడెందుకు మాఫీ చేయడం లేదని ఆయన నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles