బలోపేతమైన అధికారాలు.. నజర్ పడితే నరకమే సుమా..! IT becomes more stronger with increase of powers

It becomes more stronger with increase of powers

income tax, parliament, finance bill, arun jaitley, lok sabha, rajya sabha, nda government, pm narendra modi, demonetisation, remonetisation

The income tax officer has the right to raid anyone with giving any reason. The tax man can also confiscate property which is not subject to the raids as per the new provisions.

బలోపేతమైన అధికారాలు.. నజర్ పడితే నరకమే సుమా..!

Posted: 04/04/2017 06:34 PM IST
It becomes more stronger with increase of powers

ఆదాయపన్ను శాఖ అధికారుల నజర్ మీపైన పడకుండా చూసుకోండి సుమా..! లేదంటే నరకమే. ఇప్పటికే అనేక విశేషాధికారాలు కలిగిన అదాయ పన్ను శాఖ అధికారులకు మరిన్నీ అధికారాలు వచ్చి చేరాయి. దీంతో ఐటీ ఆఫీస‌ర్లకు విస్తృతంగా అధికారాలు అందడంతో వారిప్పుడు బలోపేతమయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నా.. ప‌న్ను ఎగ‌వేసిన‌ట్లు ఆధారాలు లభ్యమైనా.. కాదు కాదు అనుమానం కలిగినా చాలు వారు ఎలాంటి నోటీసులు గట్రా లేకుండానే మీ ఇంటిని సోదా చేస్తారు. అంతేకాదు ఫలానా దస్తావేజుకులకు అదాయశాఖకు సంబంధం లేకపోయినా సరే.. వారు దాని గురించి కూడా లోతుగా దర్యాప్తు చేసే అవకాశంతో పాటు అధికారాలు కూడా వచ్చి చేరాయి.

ఇదివ‌రకు ఎవరనిపైనైనా ఐటీ దాడులు చేయాలంటే ఫిర్యాదు చేసి ఉండ‌టం కానీ, లేదంటే పై అధికారుల ఆదేశాల‌ కోసం గానీ వేచి చూడాల్సి వ‌చ్చేది. కానీ ఇక‌పై ప‌రిస్థితి అలా ఉండ‌దు. దాడి ఎందుకు చేస్తున్నారో కూడా వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేకుండా కేంద్రం ఆదాయ పన్ను  అధికారుల‌కు ప‌వ‌ర్స్ ఇచ్చింది. అంతేకాదు మీ ఆస్తుల‌పై మీరిచ్చిన వివ‌ర‌ణ సంతృప్తిక‌రంగా లేక‌పోతే జ‌ప్తు కూడా తీసుకునే నిర్ణయం ఐటీశాఖ అధికారులు తీసుకోవ‌చ్చు. అయితే తమ వద్దనున్న అస్తులను సక్రమంగా ఇప్పటికైనా చూపితే.. కేవలం పన్నులతో బయటపడతారు. తస్మాత్ జాగ్రత్త సుమా..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : income tax  parliament  finance bill  arun jaitley  nda government  pm modi  

Other Articles