రౌండప్ చేసి.. కన్ఫూజ్ చేసి మరీ అంతం చేశారు.. bear mauls man, beaten to death

Tumakuru villagers beat bear to death

Tumakuru, Chitradurga, Villagers beat bear to death, Uppanayakanahalli, forest officials, bear mauls a man, bear assulted by villages, bear beaten by villagers, Karnataka, WhatsApp video, trending video, viral video

After days of being terrorised by a bear, tumkuru villagers of Karnataka, took matters into their own hands and beat the animal to death

ITEMVIDEOS: దారితప్పి జనారణ్యంలోకి వచ్చిన ఎలుగుబంటి...

Posted: 04/04/2017 03:43 PM IST
Tumakuru villagers beat bear to death

దండకారణ్యం బాట తప్పిన ఓ జంబూకం జనారణ్యం బాట పట్టింది. అంతే దానిన చూసిన అక్కడి మనుషులు కనీసం మానవత్వం లేకుండా దానిని తుదిశ్వాస విడిచేవరకు కర్రెలతో విచక్షణా రహితంగా కొడుతూనే వున్నారు. జనారణ్యంలో జంతువుల బారిన పడిన జంబూకం చివరకు తన ప్రాణాలను విడిచింది. సర్వబూత దయాపరా అంటూ అన్ని బూతముల యందు దయ కలిగిన వాడు మనిషని పెద్దలంటారు. కానీ రానురాను భయం గుప్పిట్లోకి జారిపోతున్న మనిషి.. అడవి మృగాలు దాడి చేయకమునుపే వాటిపై దాడులకు తెగబడి కోట్టి చంపేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని తమ్ కూర్ జిల్లాలోని ఓ గ్రామంలోకి ఓ ఎలుగుబంటి వచ్చింది. అయితే అది ఎవరిని ప్రాణహానీ తలపెడుతుందోనని గత కొన్ని రోజులుగా అందోళనకు గురైన గ్రామస్థులు.. అటవీ అధికారులకు సమాచారం అందించినా వారు స్పందించలేదు. దీంతో ఈ అంశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న గ్రామస్థులు దాని కోసం వేచిచూస్తున్న తరుణంలో అనుకోకుండా వచ్చిన ఎలుగుబండి భయంతో దాని చుట్టూ చేరిన మనుషలను చూసింది.

దానికి సమీపంలోకి వచ్చిన ఓ గ్రామస్థుడిని టార్గెట్ గా చేసుకుని అతనిపైకి దూకింది. అంతే అదే అదనుగా భావించిన గ్రామస్థులు దానిని రౌండప్ చేసి కర్రలతో విచక్షణా రహితంగా కొట్టడంతో అది అక్కడే అసువులు బాసింది. అయితే వన్యప్రాణుల సంరక్షణ కింద కూడా అటవీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని సమాచారం, అయినా గ్రామస్థులు సమాచారం అందించిన వెంటనే స్పందించి వుంటే ఓ వన్యప్రాణిని జీవం కోల్పోయేది కాదని కూడా స్థానికులు అంటున్నారు. గతంలోనే అనేక ఎలుగుబంట్లు ఈ పరిసర గ్రామాలపై పడ్డాయని, స్థానికంగా వుండే అటవీప్రాంతం నుంచి ఇవి ఇక్కడికి వస్తున్నాయని అన్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే ఇందుకు కారణమని స్పష్టం చేస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ అధికారులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tumakuru  Villagers  bear  forest officials  Karnataka  WhatsApp video  viral video  

Other Articles