అర్కే నగర్ ఉపఎన్నికలలో వ్యూహాన్ని మార్చిన దినకరణ్ DMK trying to topple govt, alleges Dinakaran

Dmk trying to topple govt alleges dinakaran

AIADMK amma, Amma Deepa Peravai, deepa jayakumar, Dinakaran, AIADMK candidate, RK Nagar bypoll, palnisamy, paneer selvam, tamil nadu, sasikala, jayalalithaa, Jayalalithaa niece, Amma Deepa Peravai, Deepa jayakumar, palnisamy, paneer selvam, DMK, mk stalin, tamil nadu politics

The AIADMK (Amma) leader and candidate for the R.K. Nagar bypoll T.T.V Dinakaran alleged that DMK leader M.K.Stalin was trying to topple his party-led government

అర్కే నగర్ ఉపఎన్నికలలో వ్యూహాన్ని మార్చిన దినకరణ్

Posted: 03/26/2017 11:26 AM IST
Dmk trying to topple govt alleges dinakaran

తమిళనాడు రాజకీయాల్లో తమ ప్రభావాన్ని చాటాలని భావిస్తున్న శశికళ వర్గం.. కాసింత ముందుచూపుతో వ్యవహరిస్తుంది, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన అమె సోంత నియోజకవర్గం అర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి తామేంటో నిరూపించుకోవాలని భావిస్తుంది పళినిస్వామి ప్రభుత్వం, అన్నాడీఎంకే పార్టీ పేరున కాకుండా 'అన్నాడీఎంకే అమ్మ' పార్టీ తరఫున రెండాకుల గుర్తుకు బదులుగా టోపీ గుర్తున ఎన్నికల బరిలోకి దిగిన టీటీవీ దినకరన్, వ్యూహాన్ని మార్చారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పేరును ప్రచారంలో వినియోగించవద్దని, ఆమె పేరు చెప్పి ఓట్లను అడగవద్దని తన పార్టీ ప్రచారకర్తలకు సూచించారు. ప్రచార బ్యానర్లలో ఎంజీఆర్, జయలలిత ఫోటోలు పెద్దవిగా ఉంచాలని, తనది చిన్న ఫోటో చాలని సూచించారు. కాగా, కరపత్రాల్లో శశికళ పేరు కనిపించినా, ఆమె ఫోటోలతో బ్యానర్లు కట్టినా, ఆర్కే నగర్ ప్రాంతంలో ప్రజలు వాటిని చించేస్తున్నారు. శశికళపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున, ఆ ప్రభావం తనపై పడరాదన్న భావనతోనే దినకరన్ ఈ సూచనలు చేసినట్టు సమాచారం.

అర్కేనగర్ లో వున్న చతుర్ముఖ పోటీలో నెగ్గాలంటే.. అమ్మ జయలలిత బొమ్మతోనే వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారట. నమ్మి పార్టీని అప్పగిస్తే టోపి పెడతావా అంటూ ఇప్పటికే శశికళ చేత కడుపు నిండా చివాట్లు తిన్న దినకరన్.. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్కేనగర్ ఉపఎన్నికలలో గెలుస్తానని శశికళకు హామీ ఇచ్చారు. దీంతో అటు ప్రత్యర్థి డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ స్టాలిన్ పై కూడా అరోపణలు గుప్పించారు, పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు స్టాలిన్ అనేక కుట్రలకు పాల్పడ్డారని దినకరన్ అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK amma  Dinakaran  Stalin  DMK  RK Nagar bypoll  palanisamy  paneerselvam  tamilnadu  

Other Articles