కేసీఆర్ పేరుతో పథకం... బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉన్నాయ్.. | KCR name in Telangana Budget 2017-18.

Kcr name for telangana government new scheme

Telangana Budget 2017-18, Rs. 1,49,446-crore Budget, 2017-18 Telangana Budget, Etala Rajender Rs. 1,49,446, KCR Kit Scheme, KCR Name New Scheme

Telangana State Finance Minister Etala Rajender today presented a development and welfare-oriented Rs. 1,49,446-crore Budget for 2017-18.

ఫస్ట్ టైం కేసీఆర్ పేరును అలా వాడేశారు

Posted: 03/13/2017 05:16 PM IST
Kcr name for telangana government new scheme

సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీలు పథకాలకు తమ నేతల పేర్లు వచ్చేలా చూసుకోవటం పరిపాటే. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డిలు అలాంటి పనే చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు అయ్యాక మాత్రం కేసీఆర్ ఆ విషయంలో ఎప్పుడూ ఆసక్తి ప్రదర్శించలేదు. అయితే ఫస్ట్ టైం ఆయన పేరుతో ఓ పథకం రూపొందించబడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రంలో గర్భిణిలుగా ఉన్న మహిళలు ప్రసవించిన తర్వాత వారికి ఓ కిట్ అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానిపేరే కేసీఆర్ కిట్. ఇందుకోసం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 605 కోట్లు ప్రకటిస్తూ కేటాయింపులు చేశాడు. ఇందులో 16 వస్తువులు ఉంటాయన్న ఆయన అందుకోసం మూడు దఫాలుగా వారికి 12 వేల రూపాయలను అందించనున్నట్లు తెలిపాడు.

ఒకవేళ పుట్టింది ఆడపిల్ల అయితే గనుక మరో 1000 రూపాయలు అదనంగా ఈ పథకం కింద ఇస్తారంట. ఆంధ్రప్రదేశ్ లో సుమారు ఇలాంటి పథకమే ఒకటి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం విశేషం. కానీ, అక్కడి కంటే ఇక్కడ ఎక్కువ నగదు ఇవ్వటం విశేషం. మొత్తానికి మహిళలను టార్గెట్ చేస్తూ పెట్టిన ఓ ప్రభుత్వ పథకానికి కేసీఆర్ పేరును వాడుకోవటం చర్చనీయాంశమైంది.

 


తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌-2017-18


19.61 శాతం వృద్ధిరేటు సాధన, రెవెన్యూ వృద్ధి గణనీయంగా పెరిగింది. కేంద్రం ఆదేశాల మేరకు ఏకరీతిన బడ్జెట్ ను రూపొందించాం. 2017-18 బడ్జెట్ రూపకల్పనలో భిన్నపద్ధతులు అవలంభించాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నాం. కొత్త నోట్ల రద్దుతో ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిలవాలని మా ప్రయత్నం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది. నాపై నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది.

గణాంకాలు:

రాష్ట్ర బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు
ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు
నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు


మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 1731 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 1249 కోట్లు
ఆసరా ఫించన్ల కోసం రూ. 5,330 కోట్లు
బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు
ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ. 1939 కోట్లు
చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు
చివరి విడత రైతుల రుణమాఫీకి రూ. 4000 కోట్లు

ఇరిగేషన్ కు రూ. 26,652 కోట్లు
విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు
వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు
పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు
మిషన్ భగీరథకు రూ. 3000 కోట్లు
రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు
జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 30 కోట్లు
మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు

జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు
పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 198 కోట్లు
శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు
ఐటీ రంగానికి రూ. 252 కోట్లు
హరితహారానికి రూ. 50 కోట్లు
విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు
పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Budget  Etala Rajender  2017-18  

Other Articles