బీజేపీ ఉపాధ్యక్షుడిపై చెప్పు పడింది. ఎవరి పని? ఆపై ఏం జరిగింది? | BJP's Samir Mohanty hurt in scuffle among party activists.

Bjp suspends 11 members in odisha

Jayanarayan Mishra, BJP Odisha, Sameer Mohanty Attack Video, Odisha BJP Vice President, Sambalpur Local Poll Attack, BJP Vice President Attack

BJP suspends former minister Jayanarayan Mishra, a state executive member and 9 ZP members over attack on party's Vice President Sameer Mohanty.

చెప్పుతో దాడి... బీజేపీ నేతలపై ఆరేళ్ల వేటు

Posted: 03/13/2017 04:54 PM IST
Bjp suspends 11 members in odisha

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జయనారాయణ్ మిశ్రా ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిషా బీజేపీ ఉపాధ్యక్షుడు సమీర్ మొహంతిపై జయనారాయణ్ మిశ్రా తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. దీనిపై సీరియస్ అయిన అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబల్ పూర్ జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడని కూడా చూడకుండా జయనారాయణ్ మిశ్రా అనుచరులు దాడికి దిగారు. చివరికి చెప్పును విసిరి కొట్టారు. దీనిపై పార్టీ తీవ్రంగా స్పందించింది. దీంతో జయనారాయణ్ మిశ్రాతో పాటు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు నౌరి నాయక్, జడ్పీకి కొత్తగా ఎన్నికైన మరో తొమ్మిది మంది బీజేపీ సభ్యులను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ఒడిషా శాఖ అధ్యక్షుడు బసంత పాండా ప్రకటించారు.

 

జడ్పీ ఛైర్మన్ ఎన్నిక పరిశీలకుడిగా వెళ్లిన సమీర్ మొహంతి అధిష్ఠానం చెప్పిందంటూ ఒక వ్యక్తిని ప్రతిపాదించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక బీజేపీ కార్యకర్తలు మరోక వ్యక్తిని జడ్పీ ఛైర్మన్ పదవికి ఎంపిక చేయాలంటూ డిమాండ్ చేశారు. దీనిని ఆయన తోసిపుచ్చడంతో ఆగ్రహానికి గురైన కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారం అని, దీనిపై పోలీస్ కేసు కూడా నమోదుచేయదల్చుకోలేదని మొహంతి తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayanarayan Mishra  Sameer Mohanty  Odisha BJP  

Other Articles