ఏడోస్థానానికి అగ్రరాజ్యం.. జాగ్రత్త సుమా అంటూ హెచ్చరికలు.. U.S. slips to seventh best country in the world after Trump election

U s slips to seventh best country in the world after trump election

Best countries, US ranking, Donald Trump, Seventh place, White House, U.S. News & World Report, University of Pennsylvania, Pennsylvania's Wharton School, global brand consultants, BAV Consulting, America, Switzerland, Canada, United Kingdom, Germany, Japan, Sweden, Australia, France, Norway

A new ranking of the best countries shows America has fallen three spots to seventh place this year after president donald trump took charge of white house.

ఏడోస్థానానికి అగ్రరాజ్యం.. జాగ్రత్త సుమా అంటూ హెచ్చరికలు..

Posted: 03/07/2017 02:38 PM IST
U s slips to seventh best country in the world after trump election

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడం ఆ వెనువెంటనే మెక్సికో నుంచి వలసలకు అడ్డుకట్ట వేసేందుకు గోడను నిర్మాణానికి పూనుకోవడం.. దీంతో పాటు ప్రపంచంలోని పలు ఇస్లామిక్ దేశాల వారు తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తూ ట్రావెల్ బ్యాన్ చేయడంతో ప్రపంచ అత్యుత్తమ దేశాల జాబితా నుంచి అమెరికా ఏడవ స్థానానికి పడిపోయింది. యూనివ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్ అండ్ గ్లోబ‌ల్ గ్రాండ్ క‌న్సల్టెంట్స్‌కు చెందిన‌ యూఎస్ న్యూస్ అండ్ వ‌ర‌ల్డ్ రిపోర్ట్ ప్రపంచంలోని అత్యుత్తమ దేశాల జాబితాను తాజాగా విడుద‌ల చేయగా, అమెరికా స్థానం ఏడుకు దిగజారిపోయింది.

ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు గతేడాది.. ప్రపంచ అత్యుత్తమ దేశాలలో నాలుగోస్థానంలో వున్న అమెరికా.. ఏకంగా మూడు స్థానాలు కిందకు జారుకుంది. కాగా అత్యుత్తమ జాబితాలో స్విట్జ‌ర్లాండ్ అగ్రస్థానంలో ఉండ‌గా రెండు, మూడో స్థానాల్లో కెన‌డా, బ్రిట‌న్ దేశాలు ఉన్నాయి. గ‌త ఏడాది కాలంలో అమెరికా ప‌ట్ల ప్రతికూల‌త‌లు ఎక్కువ‌గా నమోదు అవుతుండ‌టం, 2016 చివ‌ర్లో ఆ దేశ అధ్యక్ష ఎన్నిక‌ల త‌ర్వాత అమెరికా నాయ‌క‌త్వంపై గౌర‌వం త‌గ్గిపోవ‌డంతో అమెరికా ఏడో స్థానానికి ప‌డిపోయింది.

ఈ జాబితాలో జ‌ర్మనీ, జ‌పాన్‌, స్వీడ‌న్ అమెరికాను క‌న్నా ముందుకు దూసుకెళ్లాయి. అమెరికా అధ్యక్ష ఎన్నిక‌లు జ‌రిగిన అనంత‌రం ఈ స‌ర్వే నిర్వ‌హించి ఈ జాబితాను తాజాగా విడుద‌ల చేశారు. ఇందుకోసం ప్రపంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల‌కు చెందిన 21 వేల మంది వ్యాపార‌వేత్తలు, ప్రముఖులతో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రించారు. ఈ స‌ర్వే ద్వారా రాజ‌కీయ మార్పులు ఒక దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలిసింద‌ని యూఎస్ న్యూస్ ఎడిట‌ర్ బ్రియ‌న్ కెల్లీ పేర్కొన్నారు. అమెరికాలో నాయ‌క‌త్వం మార‌డంతో ఆ దేశంపై గౌర‌వం త‌గ్గిపోయింద‌ని ఈ స‌ర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌.

ఇదిలావుండగా, తమ దేశ పౌరులకు అమెరికా తాజాగా హెచ్చరికలు చేసింది. తమ పౌరులెవ్వరూ ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాసియా దేశాల పర్యటనలకు వెళ్లవద్దని సూచించింది. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌కు వెళ్లొద్దని, అక్కడ తిరుగుబాటు చేసే సాంఘిక వ్యతిరేక శక్తులు ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపింది. అలాగే, ఆ దేశాలకు చెందిన ఉగ్రవాదులు భారత్‌లో కూడా యాక్టివ్‌గా ఉన్నారంటూ తెలియజేసింది. గతంలో ఏడు ముస్లిం దేశాలు, ఇప్పుడు ఆరు ముస్లిం దేశాలపై అమెరికా నిషేధం విధించింది.

ఈ నేపథ్యంలో అమెరికా పౌరులపై, అమెరికాకు చెందిన స్థావరాలపై, అమెరికా శ్రద్ధ కనిబరిచే అంశాలపై దక్షిణ ఆసియాలోని ఉగ్రవాదులు, తిరుగుబాటు సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందని తమకు సమాచారం అందిన నేపథ్యంలో పైన పేర్కొన్న దేశాల్లో ప్రస్తుతం పర్యటించే ఆలోచనను విరమించుకోవాలని సష్టం చేసింది. అయితే, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న తమ పౌరులను హెచ్చరిస్తున్నామని, ప్రత్యేకంగా ఈ మూడు దేశాల్లోని వారికి ఒక సూచన చేస్తున్నట్లుగా చెప్పింది. పాకిస్థాన్‌లో అమెరికా పౌరులకు తీవ్ర వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  best country  US  travel advisory  american citizens  pakistan  

Other Articles