తన నష్టాలకు కారణం ఏంటో చెప్పిన విజయ్ మాల్యా.. Vijay Mallya blames Pratt & Whitney engines for collapse of Kingfisher Airlines

Vijay mallya blames pratt whitney engines for collapse of kingfisher airlines

Kingfisher Airlines, Vijay Mallya, Pratt and Whitney, Indigo, Go Air, Airbus,news, India news,Companies News, Business News

Loans defaulter and fugitive Vijay Mallya blamed "faulty" Pratt & Whitney (PW) engines for the collapse of his Kingfisher Airlines business.

తన నష్టాలకు కారణం ఏంటో చెప్పిన విజయ్ మాల్యా..

Posted: 03/04/2017 07:21 PM IST
Vijay mallya blames pratt whitney engines for collapse of kingfisher airlines

ఒకప్పుడు విమానయాన రంగంలో సంచలనం సృష్టించిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కుప్పకూలిపోవడానికి లోపాలున్న విమాన ఇంజన్లు కూడా ఒక కారణమని లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా అన్నారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు లోపాలున్న ఇంజన్లను సరఫరా చేసినందుకు పరిహారం చెల్లించాలని ప్రాట్‌ అండ్‌ విట్నీకి చెందిన ఐఈపై దావా వేసినట్టు ఆయన గుర్తు చేశారు. ప్రాట్‌ అండ్‌ విట్నీ విమాన ఇంజన్లపై డిజిసిఎ దర్యాప్తు చేపట్టడం తనకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదని విజయ్‌ మాల్యా ట్వీట్‌ చేశారు. లోపాలున్న ఇంజన్ల వల్ల దురదృష్టవశాత్తు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కుప్పకూలిపోయిందని ఆయన పేర్కొన్నారు.

ఎయిర్‌బస్‌ 320 నియో విమానాల్లో ఉపయోగిస్తున్న ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇంజన్లపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని విమానయాన రంగ నియంత్రణ సంస్థ డిజిసిఎ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మాల్యా ట్వీట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం తీసుకున్న రుణాలను మాల్యా ఎగవేసిన విషయం తెలిసిందే. ఫలితంగా ఈ సంస్థ 2012 సంవత్సరంలో మూతపడింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించక డిఫాల్టర్‌గా మారిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో నివసిస్తున్న విషయం తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. మాల్యా నిధుల బదిలీపై విచారణ విజయ్‌ మాల్యా తన పిల్లలకు 4 కోట్ల డాలర్ల సొమ్మును బదిలీ చేసినట్టు ఆరోపిస్తూ బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఈ నెల 9న సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ సొమ్మును వెనక్కి తెప్పించాలని బ్యాంకులు కొంతకాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్యాంకుల కన్సార్షియం తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ సమర్పించిన వ్యాజ్యాన్ని జస్టిస్‌ అదర్ష్‌ కుమార్‌ గోయెల్‌, యుయు లలితల సారథ్యంలోని బెంచ్‌ విచారణకు స్వీకరించింది. బ్రిటిష్‌ సంస్థ డియాజియో నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో పొందిన సొమ్మును మాల్యా న్యాయస్థానాల ఆదేశాలకు విరుద్ధంగా తన పిల్లలకు బదిలీ చేసినట్టు బ్యాంకులు ఆరోపించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kingfisher Airlines  Vijay Mallya  Pratt and Whitney  Indigo  Go Air  Airbus  

Other Articles