ప్రముఖ నిర్మాత శేఖర్ బాబు ఇక లేరు.. Mutha Mastri producer KC Shekar Babu no more

Mutha mastri producer kc shekar babu no more

sekhar babu, cardiac arrest, died, Mutha Mastri, mega star, Mamatha, KC Shekar Babu, Chiranjeevi, Tollywood producer, tollywood

KC Shekar Babu tollywood veteran producer died because of heart failure on morning, said his family members. Shekar Babu debuted as a producer with 'Mamatha.'

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శేఖర్ బాబు ఇక లేరు..

Posted: 02/25/2017 10:28 AM IST
Mutha mastri producer kc shekar babu no more

టాలీవుడ్ సినీ నిర్మాత కేసీ శేఖర్‌బాబు గుండెపోటుతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంగా బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం శేఖర్ బాబు మరణించారు. రెండేళ్ల క్రితం ఆయన గుండెకు శస్త్రచికిత్స జరిగిందని కుటుంబీకులు చెబుతున్నారు. ఆయన మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. 1946 మే 1న కేసీ శేఖర్‌బాబు జన్మించారు.

తెలుగులో మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్, ముఠా మేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం చిత్రాలను శేఖర్‌ బాబు నిర్మించారు. శేఖర్ బాబు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్‌లో పని చేశారు. శేఖర్‌‌బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మురళీ మోహన్ తదితరులు శేఖర్ బాబు బౌతికఖాయాన్ని సందర్శించి  తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శేఖర్ బాబు కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles