విపక్షాలు లేకుండానే.. విశ్వాస పరీక్షలో నెగ్గిన పళనిస్వామి.. palanisamy wins trust vote after dmk suspension, congress walkout

Palanisamy wins trust vote after dmk suspension congress walkout

tamil nadu, palnisamy, paneer selvam, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

Tamil Nadu Chief Minister Edappadi Palaniswami has won the trust vote in the Assembly on Saturday. 122 MLAs voted for him while 11 voted for O Panneerselvam. Majority needed was 68.

విపక్షాలు లేకుండానే.. విశ్వాస పరీక్షలో నెగ్గిన పళనిస్వామి..

Posted: 02/18/2017 03:21 PM IST
Palanisamy wins trust vote after dmk suspension congress walkout

ఊహించినట్టే జరిగింది. తీవ్ర గంధరగోళం.. రభస.. రచ్చ.. రచ్చ జరిగిన తరువాత.. పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. తన వర్గం ఎమ్మెల్యేలుగా వున్న 122 మందితో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మధ్యాహ్నం మూడు గంటల తరువాత వాయిదా తరువాత తిరిగి ఏర్పాటైన అసెంబ్లీలో పదిహేను నిమిషాల్లోనే మూజువాణి ఓటుతో పళనిస్వామి గెలిచినట్లు ప్రకటించారు స్పీకర్ ధన్ పాల్.

దీంతో తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి బలపరీక్షను నెగ్గారు. ఉదయం నుంచి విధ్వంస పరిణామాలు, గంధరగోళ పరిస్థితులతో తీవ్ర ఉత్కంఠతకు తెరలేపుతూ  కొనసాగిన పలు పరిణామాల అనంతరం ఆయన తన బలాన్ని నిరూపించుకున్నారు. సభ నుంచి డీఎంకే సభ్యులు వెళ్లిపోయిన తర్వాత, కాంగ్రెస్, ముస్లిం లీగ్  పార్టీలు కూడా వాకౌట్ చేసింది. ఈ క్రమంలో, డివిజన్ విధానాన్ని పక్కన పెట్టిన స్పీకర్... మూజువాణి విధానంతో ఓటింగ్ నిర్వహించి పళనిస్వామి బలాన్ని నిరూపించుకున్నట్లు ప్రకటించారు.  

దీంతో, అన్నాడీఎంకే శిబిరంలో ఆనందం నెలకొంది. చివరకు అమ్మే గెలిచింది అంటూ పళనిస్వామి వర్గీయులు నినాదాలు చేశారు. సభలో వున్న పన్నీరు వర్గానికి కేవలం 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముందునుంచి చెబుతున్నట్లుగానే 122 మంది ఎమ్మెల్యేలతో పళనిస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్షను నెగ్గగానే అమ్మ గెలిచింది. అంటూ వారు నినాదాలు చేశారు. అసెంబ్లీ నుంచి విజయగర్వంతో బయటకోచ్చిన ఎమ్మెల్యేలు తమ పార్టీ గుర్తుగా విక్టరీ సింబల్ ను చూపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles