మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ Whiff of booze to land Bihar officers in trouble now

Bihar officials not allowed to have alcohol even outside india

Bihar cabinet, prohibition, government employees, liquor, service rules, Prohibition, Nitish Kumar, amendment, Judicial Officers

According to the new provision, all government employees, including those from the judicial services, will be barred from consuming liquor as per the amendment in service rules in Bihar Government Servants Conduct Rules, 1976 and Bihar Judicial Officers Conduct Rules, 2017.

మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్

Posted: 02/16/2017 05:15 PM IST
Bihar officials not allowed to have alcohol even outside india

నిబంధనలను సాకుగా చూపించి నిషేధమున్న రాష్ట్రంలో మద్యం సేవించే మందుబాబులకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధలను కఠినతరం చేస్తూ సవరణలను చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలను సవరిస్తూ బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చట్టపరమైన నిబంధనలు అడ్డం పెట్టుకుని బయటి రాష్ట్రాల్లో మద్యం సేవించే అవకాశం కూడా లేకుండా చేసింది.

ఈ మేరకు 1976 బీహార్ ప్రభుత్వ సేవల ప్రవర్తనా నియమావళి, 2017 జుడిషియల్ ఆఫీసర్స్ కండక్ట్ రూల్స్‌లో సవరణలు చేసేందుకు... ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. 1976 ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే మద్యం సేవించడం నిషేధం. అయితే 2016 మద్య నిషేధ చట్టం ప్రకారం ఎక్కడా ఎప్పుడూ మద్యం సేవించకుండా నిరోధిస్తూ దీనికి సవరణ చేశారు.

దీన్ని జుడిషియల్ సర్వీసుల కింద ఉన్న అధికారులకు కూడా విస్తరించారు. తాజా నిబంధనల ప్రకారం... పనిచేసే ప్రాంతాలు, ఇళ్లలోనే కాదు... బీహార్‌కు వెలుపల ప్రయాణించేటప్పుడు కూడా మద్యం ముట్టకూడదు. బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం విధించిన నితీష్ ప్రభుత్వం... నిబంధనలు ఉల్లంఘించి మద్యపానం చేస్తే 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles