సీఎం పదవి కోసం రూ. 1000 కోట్ల ఒప్పందం Siddaramaiah paid Rs 1,000 crores for his CM seat: BS Yeddyurappa

Siddaramaiah paid rs 1 000 crores for his cm seat bs yeddyurappa

B S Yeddyurappa, MLC Govindaraju, Bagalkot, S.M. Krihsna, Siddaramaiah, congress, allegations, bjp, politics, news, nation, nation news

BJP state president, B S Yeddyurappa claimed on Friday that Chief Minister Siddaramaiah had paid over Rs 1,000 crore to some of the Congress's national leaders to retain his post.

సీఎం పదవి కోసం రూ. 1000 కోట్ల ఒప్పందం

Posted: 02/11/2017 01:55 PM IST
Siddaramaiah paid rs 1 000 crores for his cm seat bs yeddyurappa

కర్ణాటకలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటుంది. మరో ఏడాదికాలంలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న తరుణంలో అధికార అందుకోవాలని అశించే పార్టీలు ప్రత్యర్థి పార్టీపై ఇప్పటి నుంచే విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టాయి. ఈ క్రమంలో ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి చేయని పని లేదంటూ విరుచుకుపడ్డారు.

అంతటితో ఆగకుండా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠం అందుకోవడం కోసం కాంగ్రెస్ పెద్దలకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపించారు. వాటిని తిరిగి సంపాదించేందుకు చేయకూడని పనులను ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నారని అరపించారు. సిద్ధరామయ్యకు ప్రధాన అనుచరుడైన ఎమ్మెల్సీ గోవిందరాజు ద్వారా కోట్ల రూపాయాలు కాంగ్రెస్ పెద్దలకు ముట్టజెప్పినట్లు తెలిపారు. అంతేకాకుండా సిద్ధరామయ్యకు సంబంధించిన పలు ఒప్పందాల్లో గోవిందరాజు సహాయం చేశారని పేర్కొన్నారు. సీఎం వ్యవహారాలపై త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.

ఇదిలావుంటే సిద్దరామయ్య కోట్ల రూపాయాలు ఒప్పందాలను ఎవరితో చేసుకున్నారన్న ప్రశ్నలను మీడియా ప్రతినిధులు సంధించగానే ఆయన నీళ్లు నమిలారు. మీడియా ప్రతినిధులు మాత్రం ఆయనపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఎవరితో ఒప్పందాలు చేసుకున్నారన్న విషయాన్ని చెప్పకపోయినా పర్వాలేదు కనీసం కోట్ల రూపాలయను తీసుకున్న కాంగ్రెస్ పెద్దల పేర్లయినా చెప్పండీ అన్న మీడియా ప్రతినిదుల ప్రశ్నలను యడ్డీ నిరాకరించారు.

కాగా యడ్యూరప్ప విమర్శలను కాంగ్రెస్ నేతలు ధీటుగానే తిప్పకోట్టారు. డబ్బులకు ముఖ్యమంత్రి పీఠాలను అమ్ముకునే సంస్కృతి వున్న పార్టీలో వున్నవారికే ఆ విషయాలు బాగా తెలుస్తాయని, అలాంటి అరోపణలు కూడా చేస్తారని దుయ్యబట్టారు. తమ పార్టీలో నీతి, నిబద్దత, నిజాయితీ, కార్యదీక్ష వున్నవారికి పదవులు అవే వస్తాయని, అలాంటి లక్షణాలను పునికిపుచ్చుకున్న నాయకుడే తమ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అని కాంగ్రెస్ ధీటుగా బదులిచ్చింది. గతంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు నుంచి యడ్యూరప్పను బీజేపి తొలగించడానికి అసలు కారణం బీజేపి కేంద్రనాయకత్వం అడిగిన డబ్బులను ఇవ్వలేకనేనా.. అందుకనే అక్రమ గనులు కేసులలో చిక్కకున్నారా.. అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : B S Yeddyurappa  MLC Govindaraju  Bagalkot  S.M. Krihsna  Siddaramaiah  congress  bjp  politics  

Other Articles