నామ్ కే వాస్తే ఇన్విటేషన్.. వెళ్లగానే పోలీస్ అపరేషన్.. mla roja in police custody even after ap government gives name sake invitation

Mla roja in police custody even after ap government gives name sake invitation

ysrcp mla roja, roja police custody, roja arrest, gannavaram airport, ap government, womens parliament summit, vijayawada, National Women's Parliament

ysrcp mla roja taken into police custody at gannavaram airport, who is been invited by the ap government for womens parliamentarian summit held in vijayawada

ITEMVIDEOS:నామ్ కే వాస్తే ఇన్విటేషన్.. వెళ్లగానే పోలీస్ అపరేషన్..

Posted: 02/11/2017 12:13 PM IST
Mla roja in police custody even after ap government gives name sake invitation

పిలవని పేరంటానికి వెళ్తే అవమానాలు తప్పవని తెలుగింటి ఆడపడచులకు తెలియనిది కాదు. కానీ పిలిచి పరాభవించడం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలిసినంతగా ఎవరీకీ తెలియదు. ఓ వైపు జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సును నిర్వహిస్తూ.. కేంద్రమంత్రులు మొదలు రాష్ట్ర నేతలు వరకు అందరూ అడది అబల కాదు సబల అంటూ మహిళలను సాధించిన విజయాలను చూపుతూ.. వారిని వేనోళ్ల కీర్తిస్తున్న సమయంలోనే అదే రాష్ట్రానికి చెందిన ఓ తెలుగింటి అడపడచును.. అందులోనూ ఓ శాసససభ్యురాలని మాత్రం పరాభవించారు. జాతీయస్థాయిలో జరుగుతున్న ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి ఎందరో మహిళామణులు తరలివచ్చారని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. తమ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేను మాత్రం అడ్డుకోవడంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వైఎస్‌​ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానించారు. సదస్సులో పాల్గొనేందుకు వెళ్లగా అమెను గన్నవరం ఎయిర్ పోర్టులోనే నిర్బంధించారు. సదస్సులో పాల్గొనేందుకు ముందుగానే అందరు ఎమ్మెల్యేలలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆమె.. శనివారం గన్నవరం చేరుకున్నారు. అయితే ఎయిర్‌ పోర్టులో పోలీసులు రోజాను అడ్డుకున్నారు. దలైలామా అక్కడకు వస్తున్నారని సాకుగా చూపించి ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే పోలీసులు అడ్డుకుని ఒక గదిలో బంధించారు. ఆమె చుట్టూ పోలీసులు మోహరించి బయటకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు.
 
గంటసేపు ఎయిర్‌ పోర్టులోనే నిర్బంధించి.. ఆ తర్వాత పోలీసు బందోబస్తుతో రోజాను విజయవాడకు తరలించారు. వాస్తవానికి  ప్రభుత్వ అధికారులే మహిళా సదస్సుకు రమ్మంటూ ఆహ్వానించి, పాస్ జారీ చేశారు. తీరా సదస్సు కోసం విమానాశ్రయం వరకు వచ్చిన తర్వాత అడ్డుకున్నారు. అధికారులు నామమాత్రంగా అహ్వానాన్ని పంపినా.. సదస్సులో పాల్గోనేందుకు మాత్రం రోజా తన పేరును రిజిస్టేషన్ చేయించుకున్నారు. దీంతో పోలీసులను అప్రమత్తం చేసిన అధికార యంత్రాంగం అమెను విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుంది. ఒక వైపు మహిళల హక్కుల కోసం పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహిస్తూ.. మరోవైపు మహిళా ఎమ్మెల్యేను నిర్బంధించడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపణలు వస్తున్నాయి.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఆచూకీ తెలియడం లేదని వైసీపీ నేతలు అరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు దాటిన తర్వాత నుంచి ఫోన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయారు. పేరేచర్ల జంక్షన్ వద్ద పోలీసులు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. మధ్యలో ఒకచోట రోజా పెద్దగా కేకలు పెట్టారని, రక్షణ కోసం పోలీసు వాహనం నుంచి కిందకు దిగేందుకు కూడా ప్రయత్నించారని కొందరు అంటున్నారు. ఆ ప్రయత్నంలో ఆమె కింద పడిపోయారని, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని చెబుతున్నారు.

ఆ సమయంలో పోలీసులు బలవంతంగా ఆమెను మళ్లీ వాహనంలోకి తోసేశారని సమాచారం. తన పట్ల పోలీసుల దుష్ప్రవర్తనపై రోజా కన్నీళ్లు పెట్టుకున్నారని కూడా అరోపిస్తున్నారు. గన్నవరం నుంచి మేడికోండూరు వరకు సుమారు 90 కిలోమీటర్ల దూరం అమెను అత్యంతర కట్టుదిగ్టమైన భధ్రతల మధ్య తరలించాల్సిన అవసరం ఏమి వచ్చిందని కూడా నేతలు ప్రశ్నిసతున్నారు. జాతీయ మహళా పార్లమెంటు సదస్సు సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వానికి మహళలపై వున్న నిజమైన వైఖరి తేటతెల్లమైందని కూడా విమర్శిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ బడాయిల కోసం డ్రామాలు వేస్తూ సదస్సులను నిర్వహిస్తే మహిళలు మెచ్చుకోరని, సాటి మహిళలను గౌరవిస్తేనే, వారికి దక్కాల్సిన మర్యాద వారు పోందితేనే ప్రభుత్వానికి కూడా హితమని సూచనలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles