మళ్లీనా.. అంటూ బ్యాంకులకు పరుగులు..! Rumours of ban on Rs 10 coins trigger panic in Karnataka

Rumours of ban on rs 10 coins trigger panic in karnataka

Karnataka, RS 10 coins fake, Rs 10 coins, RBI action, RBI, Indian central bank, Reserve Bank of India, demonetisation, India news, latest news

A rumour has spread across Karnataka that Rs 10 coins had been declared invalid by the RBI after some counterfeit coins in two designs had flooded the market

మళ్లీనా.. అంటూ బ్యాంకులకు పరుగులు..!

Posted: 02/10/2017 07:39 PM IST
Rumours of ban on rs 10 coins trigger panic in karnataka

పాత పెద్ద నోట్ల రద్దు తో అనేక అవస్థలు పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే అ అవేదన నుంచి బయటపడుతున్న క్రమంలో మరో సంచలనం రేకేత్తించే విధంగా కర్ణాటకలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా కేంద్రం పది రూపాయల నాణేలను కూడా వెనక్కు తీసుకుంటుందన్న పుకార్లు కర్ణాటకలోని ప్రజలను, వ్యాపారులను బ్యాంకులకు పరుగులు పెట్టించాయి. కేంద్రం రూ.10 నాణేలను నిషేధించిందని, ఇక అవి చెల్లుబాటు కావంటూ ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆర్బీఐ ప్రకటించిదని కూడా వార్తలు గుప్పుమన్నాయి.

అటువంటిదేమీ లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో బ్యాంకులకు పరుగులు పెట్టిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మార్కెట్లోకి నకిలీ నాణేలు పెద్ద ఎత్తున ప్రవేశించడంతో వాటిని అరికట్టేందుకు ఆర్బీఐ రద్దు చేసిందంటూ ఒక్కసారిగా పుకార్లు వ్యాపించాయి. దీంతో వాటిని తీసుకునేందుకు అటు వ్యాపారులు, ఇటు ప్రజలు నిరాకరించారు. దీంతో తమ వద్ద ఉన్న పది నాణేలను మార్చుకునేందుకు అందరూ బ్యాంకులకు పరుగులు తీశారు. విషయం తెలుసుకుని ‘హమ్మయ్య’ అనుకున్నారు. కాగా పది నాణేలపై ఇప్పటికే పలుమార్లు వివరణ ఇచ్చిన ఆర్బీఐ తాజాగా మరోమారు వివరణ ఇచ్చింది. వదంతులు నమ్మవద్దని కోరింది. నాణేలను స్వీకరించేందుకు నిరాకరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles