మణపురంలో మరోమారు అదే తరహాలో దోపిడీ.. Armed men decamp with 33 kg gold in Gurugram

Armed men rob gold worth crores at manappuram finance in gurugram two workers injured

Gurgaon heist, Manappuram Finance, Gurgaon Gold Robbery, New Railway road, Gurgaon robbery, Sandeep Khirwar, Crime in Gurgaon, Gurgaon crime news, Gurgaon police, Gurugram Police, Money Gold Rathnam, Haryana, Police, India news, latest news

seven armed men allegedly looted gold and Rs 5 lakh in cash from Mannappuram gold loan branch in Gurugram, the looters stabbed a security guard and a customer.

మణపురంలో మరోమారు దోపిడీ.. ఎందుకు టార్గెట్ అయ్యింది.?

Posted: 02/10/2017 11:00 AM IST
Armed men rob gold worth crores at manappuram finance in gurugram two workers injured

తమకు తాము సీబిఐ అధికారులమని పోజు కొడుతూ హైదరాబాద్ శివార్లలోని రామచంద్రాపురం బీరంగూడలోని మణ్ణపురం ఫైనాన్స్ కంపెనీలో సుమారు 80 లక్షల విలువైన బంగారు అభరణాలతో ఉడాయించిన ఘటనను మరువక ముందే మరోమారు అదే సంస్థను దొంగలు టార్గెట్ చేశారు. బీరంగూడలో దోపిడికి యత్నించిన ముఠాలోని కీలక సభ్యుడు ఇంకా పరారీలోనే వుండగా, ఇదే సమయంలో మళ్లీ అదే మణప్పురం ఫైనాన్స్ సంస్థ దోపిడీ దొంగలకు లక్ష్యంగా మారింది.

హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ లో మణప్పురం సంస్థ కార్యాలయంలో గురువారం దొంగలు పట్టపగలే చొరబడి రూ.9 కోట్ల విలువ జేసే 32 కిలోల తాకట్టు బంగారు ఆభరణాలతో పరారయ్యారు. తాము సాధారణ కస్టమర్ల తరహాలో ఫోజుకొడుతూ ముఖాలకు మాస్కులు ధరించి వచ్చిన దొంగలు తమను సీసి కెమెరాలు బంధించకుండా వుండేందుకు వాటిపై సెయింట్ లాంటి ద్రవ్యాన్ని చల్లారు. దీంతో ఇక తమకు అడ్డూ అదుపు లేదని భావించిన ఎనిమిది మంది దొంగల ముఠా ఆయుధాలతో న్యూ రైల్వే రోడ్డు శాఖలోకి చొరబడి వాల్ట్ లలో ఉన్న 32 కిలోల బంగారు ఆభరణాలతోపాటు రూ.7.8లక్షల నగదును సైతం దోచుకున్నారు.

తొలుత దొంగలు ద్వారం వద్ద ఉన్న కాపలాదారుడి నుదుట పదునైన ఆయుధంతో దాడికి పాల్పడి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత మరో కాపలాదారుడి చేతిలోని ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అందులోంచి కార్ట్రిజులు తీసుకున్నారు. అందులో పనిచేస్తున్న ఉద్యోగులను లోనికి ప్రవేశిస్తునూ అదుపులోకి తీసుకున్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో ముగ్గురు వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. వారిలో ఒకరు సెక్యూరిటీ గార్డు కాగా, మరో ఇద్దరు కస్టమర్లు వున్నారు. వారిని గుర్ గావ్ లోని ప్రభుత్వ అస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

మణప్పురం ఫైనాన్స్ కేరళలోని త్రిస్సూర్ జిల్లా వాలప్పాడ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 3,200 కార్యాలయాలు ఉన్నాయి. గతేడాది కోల్ కతా, థానే, నాగ్ పూర్, జలంధర్ లోని మణప్పురం సంస్థ కార్యాలయాల్లో దొంగలు భారీ దోపిడీలకు పాల్పడ్డారు. ఈ ఏడాది జనవరి 5న ఛత్తీస్ గఢ్ లోని ఓ శాఖలోనూ విలువైన సొత్తును దోచుకున్నారు. ఉద్యోగులు తక్కువ సంఖ్యలో వుండటం, శిక్షణ పోందిన సెక్యూరీటీ లేకపోవడం, కస్టమర్లు కూడా పెద్ద సంఖ్యలో వుండని కారణంగానే దొంగలు మణపురం సంస్థలను టార్గెట్ చేస్తున్నారన్న అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mannappuram  Gurugram  Money Gold Rathnam  Mannappuram gold loan  Haryana  Police  crime  

Other Articles