మహిళలపై శాసనసభ స్పీకర్ అనుచిత వ్యాఖ్యలు kodela siva prasad rao controversy comments on women

Ap speaker kodela siva prasad rao controversy comments on women

Assembly, Speaker, Kodela Siva Prasada Rao, Meet the Press, Press Club, Vijayawada, national women's parliament, amaravati, Accidents, Women jobs, NWP, benchmark, Amaravati declaration, Kodela Siva Prasada Rao controversy comments

Assembly Speaker Kodela Siva Prasada Rao participated in ‘Meet the Press’ at Press Club at Vijayawada in regard of national women's parliament in amaravati

ITEMVIDEOS: మహిళలపై శాసనసభ స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 02/09/2017 11:14 AM IST
Ap speaker kodela siva prasad rao controversy comments on women

విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ మహిళ పార్లమెంట్ సమావేశాలకు అన్ని తానై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున బాధ్యతలు తీసుకుని వ్యవహరిస్తున్న అంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రపాద్ రావు.. పనిలో పనిగా వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే తాను ఏం మాట్లాడకూడదో అది మాట్లాడేసిన తరువాత.. ఇక నోరు కరుచుకున్న స్పీకర్. తన మాట తీరును మార్చారు. మహిళలు తమను తాము కాపాడుకునే విధంగా మార్షల్ ఆర్ట్స్ తో పాటు మిగతా వాటిల్లో కూడా తర్ఫీదు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం స్పీకర్ కోడెల ఆ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానకి ఆయన హాజరై ప్రసంగిస్తూ.. మహిళలను వాహనాలతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక వాహనం కొని షెడ్‌లో ఉంచితే ప్రమాదాలు జరగవు.. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. స్పీడ్ ఎక్కువగా వుంటే మరింత ప్రమాదానికి అవకాశం వుంటుంది. యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తే ప్రమాదం జరిగిన గాయాల భారిన పడే శాతం తక్కువని, అదే అంతకన్నా అధిక స్పీడ్ తో వెళ్తే. మరిన్ని గాయాలు తగిలే అవకాశముందని అన్నారు.

మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు పాత రోజుల్లో మాదిరిగా వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలంటూ బయట తిరుగుతూ.. సమాజానికి ఎక్స్ పోజ్ అవుతున్నారు. అందుకనే వారు వేధింపులకు గురవుతున్నారు. అలా మాట్లాడుతున్న స్పీకర్ తాను మాట్లాడుతున్న దానికి మీడియా మిత్రులు ముఖాలలో హావభావాలు మారిపోవడం గమనించారు. అంతే ఒక్కసారిగా తన వ్యాఖ్యలను సరిదిద్దుకున్నారు. అలా అని మహిళలు చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయవద్దని కాదు అంటూ మాటమార్చారు.

మరి అడపిల్లలు ఏం చేయాలని కింగ్ ఫ్యూ ఒక్కటే కాకుండా ఇలాంటి మార్షల్ అర్ట్స్ లలో తర్పీధును తీసుకుని తమ రక్షణను స్వతహాగా చేసుకోగలగాలని అప్పుడే మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. దీంతో పాటు బాల్య వివాహాలు, అక్రమ రవాణా తదితర వాటిని అరికట్టాలంటే చట్టాలు ఒక్కటే ఉంటే సరిపోదన్నారు. ఆ చట్టాలు అమలు కావాలంటే ముఖ్యంగా మహిళల్లో ధైర్యం రావాలన్నారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మూడు రోజుల పాటు జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles