ఒబమానే కావాలి.. ట్రంప్ ఎంత మాత్రం వద్దు..Majority of Americans want Barack Obama back as President

Majority of americans want barack obama back as president

barack obama, donald trump, us president, good old days, no confidence record, American president, white house, h1b1

Less than two weeks into Donald Trump's presidency, a majority of Americans want Barack Obama back as President, and trump should be removed from office

ఒబమానే కావాలి.. ట్రంప్ ఎంత మాత్రం వద్దు..

Posted: 02/03/2017 08:32 PM IST
Majority of americans want barack obama back as president

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై ప్రజలు సహజంగానే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇన్నాళ్ల డెమొక్రటిక్ పాలన తరువాత వచ్చిన రిపబ్లికన్ తమ సంక్షేమాన్ని కాంక్షిస్తారని, తమ అభివృద్ది కోసం అనేక పథకాలతో పాటు పలు నిర్ణయాలు తీసుకుంటారని ఎదురుచూస్తారు. అయితే ట్రంప్ విషయంలో మాత్రం అమెరికావాసుల ఆశలు ఆవిరైయ్యాయి, అంతేకాదు పది రోజుల వ్యవధిలోనే ఆయనపై అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బరాక్ ఒబామా మళ్లీ తమ దేశానికి అధ్యక్షుడిగా రావాలని కోరుకుంటున్నారు. ట్రంప్ ను తక్షణం దిగిపోవాలని అక్షేపిస్తున్నారు.

బరాక్ ఒబామా పాలనలో వున్న పాత మంచి రోజులు మళ్లీ తిరిగి వస్తే ఎంత బాగుండి అని అమెరికా వాసులు కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే అలోచిస్తున్నారంటే.. ట్రంప్ పాలనపై వారి అసంతృప్తి ఎంత స్థాయిలో వుందో ఇట్టే అర్థ: చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం ఒక్క వర్గం వారు కాదు. అన్ని వర్గాల నుంచి ట్రంప్ కు వ్యతిరేకత ఎదురవుతుంది. బాహాటంగా నిరసనకారులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నా.. అవన్నీ తన చెవిన పడినా.. పట్టనట్లు ట్రంప్ వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

నూతనంగా దేశ పరిపాలన పగ్గాలను అందుకున్న అధ్యక్షులు ఎవరైనా తమపై ప్రజల్లో వ్యతిరేక భావన రావడానికి కొందరికి కొన్ని వారాలే కాదు, మరికోందరికి కొన్ని నెలలు, ఇంకోందరికి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. ఈ విషయంలో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలో దేశాధ్యక్షుల రికార్డులన్నింటినీ బద్దలుకొట్టారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేవలం ఎనిమిదంటే ఎనిమిది రోజుల్లోనే ప్రజల అవిశ్వాసాన్ని మూటగట్టుకున్నారు.
 
50 శాతం ప్రజల విశ్వాసం కోల్పోవడానికి బిల్‌ క్లింటన్‌కు 573 రోజులు పట్టగా, సీనియర్‌ జార్జిబుష్‌కు 1,336 రోజులు పట్టింది. బరాక్‌ ఒబామాకు 936 రోజులు పట్టింది. డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన పట్ల 45 శాతం మంది విశ్వాసం ప్రకటించగా, 45 మంది అవిశ్వాసం వ్యక్తం చేశారు. పది శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు. అధికార బాధ్యతలు స్వీకరించి మెక్సికో సరిహద్దులో గోడ కడతానని ప్రకటించడం, హెల్త్‌కేర్‌ చట్టాన్ని రద్దు చేయడం, అబార్షన్‌ చట్టాన్ని మార్చడం, ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రజల రాకపోకలపై నిషేధం విధించడంతో ఆయన పట్ల అవిశ్వాసం ఒక్కసారిగా 51 శాతానికి పెరిగిందని ‘గాలప్‌ పోల్‌’ ఓ ప్రకటనలో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles