బెంగళూరులో కలకలం.. కాంగ్రెస్ నేతపై కాల్పులు.. Bengaluru shootout leaves one dead

Bengaluru shootout leaves one dead several injured

Two Bike borne miscreants, Kogilu cross, Dasanapura APMC president, Kadabagere Srinivas, Yelahanka, Bengaluru police

Two Bike borne miscreants fired at a car in Kogilu cross in which congress leader srinivas was travelling in the broad day light on Friday afternoon.

ITEMVIDEOS: బెంగళూరులో కలకలం.. కాంగ్రెస్ నేతపై కాల్పులు..

Posted: 02/03/2017 04:41 PM IST
Bengaluru shootout leaves one dead several injured

బెంగళూరు సిటీలో పట్టపగలు నట్టనడి వీధిలో కాల్పలు కలకలం రేపాయి. పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగర శివార్లలోని ఓ కారును లక్ష్యంగా చేసుకుని మోటార్ సైకిల్ (పల్సర్ బైక్) పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని అగంతకులు అకస్మాత్తుగా కాల్పలు జరిపారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడ మృతిచెందగా, పలువురు గాయపడ్డారని సమాచారం. అయితే గాయపడిన వారిని పోలీసులు హుటాహుటిన అసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు,

గత కొద్ది రోజుల క్రితం వరకు బీజేపిలో కొనసాగిన కడబగెరి శ్రీనివాస్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాసనపురా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా వున్న ఆయనను లక్ష్యంగా చేసుకునే అగంతకులు కాల్పులు జరిపారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇద్దరు తలకు హెల్మెట్ పెట్టుకుని గుర్తుపట్టడానికి వీలు లేకుండా వున్నారని తెలుస్తుంది. అయితే శ్రీనివాస్ ను ఆయన ఇంటి వద్ద నుంచి ఫాలో అవుతున్న నిందితులు.. ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి పాలో అవుతున్నారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలసింది.

ఈ కాల్పుల ఘటనతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ తో పాటు అతని స్నేహితులను, డ్రైవర్ ను కూడా పోలీసులు అసుపత్రికి తరలించారు. కొలిగు క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఈ ఘటనపై పాదచారులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఫోరెన్సిక్ నిఫుణులతో పాటు డాగ్ స్వాడ్ తో వచ్చిన పోలీసులు ఘటనా స్థలంలో అధారలను అన్వేషించే పనిలో వున్నారు. కాగా సిసి ఫూటేజీని పరిశీలించి నిందితులను గుర్తిస్తామన్నారు. నిందితులు తప్పించుకోకుండా బెంగళూరు నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles