కొత్త కరెన్సీపై మరో అసక్తికర విషయం Centre Okayed New Currency 5 months before ban, reveals rti

Centre okayed new currency 5 months before ban reveals rti

Notes Ban, Cash Ban, Currency Ban, RBI,RTI, New Notes, Cash Crunch, New Currency notes design, currency notes design, design approval, Demonetisation

The design of the new Rs. 2,000 and Rs. 500 notes were approved by the government on June 7, 2016, before it demonetised high denomination currency bills would no longer be valid.

కొత్త కరెన్సీపై మరో అసక్తికర విషయం

Posted: 01/28/2017 04:57 PM IST
Centre okayed new currency 5 months before ban reveals rti

పెద్ద నోట్ల రద్దు తరువాత అందుబాటులోకి వచ్చిన కొత్త కరెన్సీ నోట్ల విషయంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కొత్త కరెన్సీ నోట్ల డిజైన్ ను భారతీయ రిజర్వు బ్యాంకు ఎప్పుడు ఆమోదం తెలిపిందన్న విషయం వెల్లడైంది. డీమానిటైజేషన్ కు సరిగ్గా ఐదు నెలల ముందు అంటే జూన్ 7వ తేదీన కొత్త రూ.2000, రూ.500 నోట్ల డిజైన్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆర్బీఐ తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా  ధాఖలైన ఓ పిటిషన్కు సమాధానంగా ఆర్బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది.

కొత్త నోట్ల డిజైన్‌కు గ‌త ఏడాది మే 19న ఆర్బీఐ ఆమోదం తెలిపిందని ఓ టీవీ ఛానెల్ సమాచార హక్కు చట్టం కింద వేసిన పిటీషన్ కు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ త‌ర్వాతే ఆ కొత్త నోట్ల‌కు కేంద్రం కూడా త‌న ఆమోదాన్ని ప్ర‌క‌టించిందని తెలిపింది.  అయితే కొత్త 2వేలు, 500 నోట్ల‌ను ముద్రించేందుకు ఎంత కాలం ప‌డుతుంద‌ని వేసిన ప్ర‌శ్న‌కు మాత్రం ఆర్బీఐ స‌మాధానం ఇచ్చేందుకు నిరాక‌రించింది.

స‌మాచారం వెల్ల‌డించ‌డం వ‌ల్ల దేశ స‌మ‌గ్ర‌త దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని త‌న రిపోర్ట్‌లో పేర్కొంది. నోట్ల ర‌ద్దుపై జర్నలిస్టులు, కార్యకర్తలు వేసిన మ‌రో ఆర్టీఐ ప్ర‌శ్న‌కు కూడా సెంట్రల్ బ్యాంకు స్పందించింది. పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని న‌వంబ‌ర్ 8వ తేదీన కేంద్రానికి సూచ‌న చేశామ‌ని, ఆ రోజు రాత్రే ప్ర‌ధాని మోదీ టెలివిజన్ స్పీచ్ ద్వారా పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్నట్టు ప్రకటించారని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles