రోడ్డు కోసం శ్రమించిన భగీరధుడు.. 3 years efforts by Sashi, a paralysed man, gave a road

3 years efforts by sashi a paralysed man gave a road for the residents

Kerala paralysed man, paralysed man digs road, semi-paralysed man digs road, Sashi G, sashi road, sashi, kerala man, paralysis, tri-cycle, Thiruvananthapuram

Sashi G 59-year-old coconut climber, who is partially paralysed, has been digging a road outside his home in Kerala for past three years finally has a road.

కొండను తవ్వి.. రోడ్డును వేసి.. శ్రమించిన భగీరధుడు..

Posted: 01/11/2017 03:06 PM IST
3 years efforts by sashi a paralysed man gave a road for the residents

దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చేందుకు అనేక వ్యయప్రయాసలకు ఓర్చాడు భగీరదుడు. భువిపైనున్న జీవిరాశులన్నింటికీ గంగను అందించి అపర భగీరధుడిగా చిరస్థాయిగా చరిత్రలో నిలిచాడు. అయితే అది ఇతిహాసానికి సంబంధించిన అంశమే అయినా.. ఇటీవలి కాలంలో తన భార్య కోసం గ్రామంలోనే ఒంటరిగా బావిని తవ్విన చూశాం. అలాగే బీహార్ లో కొండను తవ్వి.. రోడ్డు మార్గం వేసిన మాంఝీని చూశాం.. తాజాగా.. అలాంటి వ్యక్తినే కేరళలో వార్తలలో నిలిచాడు. ఈయన కూడా ఏకంగా మూడేళ్ల పాటు శ్రమించి ఊరికి రోడ్డేశారు. అయితే ఈయన వారిద్దరి కన్నా చాలా గోప్పవాడు, మొక్కవోని అత్మస్థైర్యంతో, అకుంటిత దీక్షతో తన శరీరం సహకరించకున్నా.. పట్టుదలను వదలకుండా ఏకాగ్రతతో పనిపూర్తి చేశాడు.

పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జి.శశి. వయస్సు 59 ఏళ్లు. కేరళలోని మారుమూల ప్రాంతం. 18 ఏళ్ల క్రితం కొబ్బరి చెట్టుపై నుంచి పడిపోయాడు. దీంతో కుడివైపు పక్షవాతం సోకింది. అయితే అతను అలాగే కూర్చో లేదు. ఏదో ఒకటి చేసుకుంటూ కాలం గడిపేశాడు. మూడేళ్ల క్రితం సడెన్ గా ఓ ఆలోచన వచ్చింది. ట్రైసైకిల్ ఉంటే.. ఏదైనా చిన్న షాప్ పెట్టకుందామనుకున్నాడు. పక్షవాతం వచ్చిన తనకు ట్రై సైకిల్ ఇప్పించమని గ్రామ పంచాయతీకి అర్జీ కూడా పెట్టేసుకున్నాడు.

అయితే దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు సరికదా… దాని గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. తీరా అరా తీయగా, తన ఇంటికి రోడ్డు లేదన్న కారణంగా తనకు మూడు చక్రాల సైకిల్ ఇవ్వలేమని పంచాయితీ అధికారులు తేల్చచెప్పారు. దీంతో శశి నిరుత్సాహానికి గురికాలేదు. పైపెచ్చు.. తన ఇంటికి రోడ్డు వేస్తే సైకిల్ ఇస్తారన్న ఆశతో రోడ్డు పనులను చేపట్టాడు. పక్షవాతం బారిన పడిన ఆయన గత మూడేళ్లుగా రోజుకు ఆరు గంటల పాటు రోడ్డు కోసం శ్రమించాడు. అలా తన ఇంటితో పాటు ఇరుగుపోరుగునున్న వారికి కూడా రోడ్డును వేశాడు.

సుమారుగో రెండు వందల మీటర్ల పోడువున రెండు మీటర్ల వెడల్సున ఆయన ఈ రోడ్డును వేశారు. ఈ క్రమంలో ఆయన ఎత్తుపల్లముండే కొండ ప్రాంతమైన కేరళలోని తిరువనంతపురంలోని తన గ్రామంలో రోడ్డును వేసుకున్నాడు. ఇది చూసి ఇరుగుపోరుగు వారు శశిని అభినందించడం ప్రారంభించారు. అయితే తనకు ప్రశంసలు వద్దని, కేవలం ట్రై సైకిల్ మాత్రమే కావాలని ఆయన అర్థిస్తున్నాడు. మరి ఇప్పటికైనా పంచాయితీ పెద్దలు ఆయనకు ట్రైసైకిల్ ఇస్తారా లేదా అన్న అనుమానమే..? అయితే ఈ రోడ్డుతో తనలోని అత్మవిశ్వాసం పెరిగిందని, తనకు సైకిల్ ఇచ్చానా.. ఇవ్వకపోయినా తాను అధైర్యపడనని అంటున్నాడు ఈ కేరళా భగీరధుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sashi  kerala man  paralysis  road  tri-cycle  thiruvananthapuram  

Other Articles