మంచి బోజనం అడిగితే.. మెంటలోడంటారా.? BSF jawan row: Tej Bahadur Yadav’s wife takes to social media

Bsf jawan s wife says tej bahadur yadav is not contactable since monday evening

Tej Bahadur Yadav wife, contactable, army, army corruption, bsf, bsf jawan, jawan video, basf jawan video, army man video, jawan viral video

The wife the BSF jawan, Tej Bahadur Yadav, has taken to Facebook to allege that she had lost contact with her husband since Monday evening after videos went viral.

మంచి బోజనం అడిగితే.. మెంటలోడంటారా.?

Posted: 01/11/2017 01:08 PM IST
Bsf jawan s wife says tej bahadur yadav is not contactable since monday evening

తన భర్త వెలుగులోకి తెచ్చిన విషయాలన్నీ వాస్తవమేనని, మంచి బోజనం అడిగటం కూడా తప్పేనా.. అని బీఎస్ఎఫ్ జవాను సతీమణి తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ భార్య అర్మీ అధికారులను ప్రశ్నించారు. బోజనం బాగోలేదని పిర్యాదు చేసినంత మాత్రన మెంటలోడని ఎలా అంటారని అమె అధికారులను నిలదీశారు. తన భర్తపై లేనిపోని కథనాలను కల్పిస్తున్నారని ఇది సమంజసం కాదని అమె అధికారుల తీరుపై ఏకిపారేశారు. తన భర్త బహదూర్‌ యాదవ్‌ మానసిక పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.

తన భర్తకు మతిస్థిమితం తప్పిందన్న వార్తలు సత్యదూరమన్న అమె.. అలాంటిదే వుంటే అతను సరిహద్దులో ఎలా విధులు నిర్వహిస్తారని ఎదురు ప్రశ్నించారు. కాగా, తన భర్త పోస్టు చేసిన వీడియో దేశ ఆర్మీలో ప్రకంపనలు సృష్టిస్తున్నప్పటి నుంచి తేజ్ బహదూర్ యాదవ్ తమతో కాంటాక్టులోకి రాలేదని అమె అరోపించారు. తన భర్తతో ఫోన్‌ లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాడని, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త భద్రతపై అమె అనుమానాలను వ్యక్తం చేశారు.

దేశం కోసం అనునిత్యం శ్రమిస్తున్న జవాన్లకు మంచి ఆహారం పెట్టామని అడగడం తప్పుకాదని బహదూర్‌ యాదవ్‌ కుమారుడు రోహిత్ అన్నాడు. సైనికుల సరైన ఆహారం అందిచడం లేదని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశాడు. తమకు న్యాయం జరగాలని ఆకాంక్షించాడు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు తేజ్‌ బహదూర్‌ యాదవ్ పై క్రమశిక్షణ చర్య తీసుకుంటామని, ఆయనను కోర్టు మార్షల్ గా హెడ్ క్వార్టర్స్ కు బదిలీచేశామని కూడా బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ డి.కె. ఉపాధ్యాయ తెలిపారు.

ఇదే నేపథ్యంలో మరో జవాను సరిహద్దువద్ద విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న దుస్థితిని కేంద్రం దృష్టికి తీసుకొచ్చాడు. ఈ మేరకు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఓ జవాను రాసిన 9 పేజీల లేఖను ప్రముఖ వార్తాసంస్థ ప్రచురించింది. ఆహారం మొదలు దుస్తులు, వసతి, నియామకాలు, పనిగంటలు, ఆయుధాలు సహా అన్ని సమస్యలు తన లేఖలో ఏకరువు పెట్టాడు. 8 గంటలు పనిచేస్తున్నట్టు పేపర్లలో రాసుకుంటూనే.. వరుసగా 20 గంటల పాటు తమతో డ్యూటీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆహారం కోసం కేటాయించిన నిధులు భోజనంపై ఖర్చుపెట్టకుండా... రోజులో ఇతర కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని వెల్లడించాడు. కేంద్ర సాయుధ పోలీసు దళాల నిబంధనల ప్రకారం ఒక్కటీ జరగదని ఆక్రోశం వెళ్లగక్కాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jawan  Facebook  BSF  Tej Bahadur Yadav wife  contactable  army  border security force  

Other Articles