హైదరాబాద్ లో దారుణం: మైనర్ బాలికపై అత్యాచారం.. minor girl molested at abdullapurmet

Locals thrashed molesters handovered to police at abdullapurmet

rape, gangrape, rape attempt, minor girl, rape attempt on minor girl, two youth beaten, abdullapurmet, masjidpur, hayathnagar, crime news,

locals thrashed two molesters who attempted to abduct a minor girl on the way to her home after the school hours in abdullahpurmet

హైదరాబాద్ లో దారుణం: మైనర్ బాలికపై అత్యాచారం..

Posted: 01/04/2017 06:14 PM IST
Locals thrashed molesters handovered to police at abdullapurmet

బెంగళూరులోని సిలికాన్ వ్యాలీలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో భాగంగా అక్కడికి చేరుకున్న యువతులపై అరాచకశక్తుల మంద తమ అంగబలం, మందబలంతో వారిపై బహిరంగంగా జరిపిన కీచక పర్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తున్న తరుణంలో.. అలాంటి ఘటనకే పాల్పడిన యత్నించిన ఇద్దరు యువకులను స్థానికులు దేహశుద్ది చేశారు, ఈ ఘటన హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ అబ్దుల్లాపూర్‌మెట్‌ మండటం మజీద్‌పూర్‌లో జరిగింది.

స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల నుంచి ఇంటికి న‌డుచుకుంటూ వెళుతుంది. అప్పటికే మ‌ద్యం మత్తులో ఉన్న ఇద్దరు కామాంధులు ఆ బాలిక‌ను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యాచారయ‌త్నం చేశారు. అయితే బాధితురాలి అరుపులు కేకలు విని అప్రమత్తమైన స్థానికులు రమేష్, శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులను పట్టుకుని దేహశుద్ది చేసి.. పోలీసులకు నిందితులను అప్పగించారు. బాలిక పిర్యాదును స్వీకరించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. బాధితురాలని వైద్యచికిత్సల నిమిత్తం అస్పత్రికి తరలించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles