శశికళ వర్సెస్ శశికళ.. మధ్యలో మొగుడు పచ్చడి అయ్యాడు | Sasikala Pushpa's Husband Arrested by Chennai Police.

Aiadmk rebel sasikala pushpa husband missing

Sasikala Pushpa, Sasikala Pushpa Husband, Sasikala Pushpa Lingeswara Thilagan, Lingeswara Thilagan, Sasikala husband attack, AIADMK attack, AIADMK Sasikala Pushpa, Lingeswara Thilagan attack, Lingeswara Thilagan missing, Lingeswara Thilagan arrest, Lingeswara Thilagan Sasikala Pushpa

Sasikala Pushpa's husband Lingeswara Thilagan injured after being attacked later arrested.

శశికళ భర్త మిస్సయ్యాడంట!

Posted: 12/29/2016 08:30 AM IST
Aiadmk rebel sasikala pushpa husband missing

బుధవారం తమిళనాడులో బుధవారం జరిగిన పొలిటికల్ హైడ్రామా ముదిరిపోతుంది. కేవలం న్యాయవాదిపైనే దాడి చేశారనుకుంటే రాజ్య‌స‌భ స‌భ్యురాలు, రెబల్ శశిక‌ళ పుష్ప భ‌ర్త లింగేశ్వ‌ర్‌ తిల‌క‌న్‌ ను కూడా అన్నాడీఎంకే పార్టీ కార్య‌క‌ర్తలు వదలిపెట్టలేదంట. ర‌క్త‌మోడుతున్నా వ‌దిలి పెట్ట‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్టు ముష్టిఘాతాలు కురిపించారు. నోరు, ముక్కులో నుంచి రక్తం కారుతున్నా ఆయ‌న‌ను వ‌దిలిపెట్ట‌లేదు. చివ‌రికి పోలీసులు ఆయనను ర‌క్షించి ఆస్ప‌త్రిలో చేర్పించారు.

నేడు జ‌ర‌గ‌నున్న పార్టీ సర్వస‌భ్య స‌మావేశంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ర్శిని ఎన్నుకోనున్నారు. ఈ ప‌దవికి శ‌శిక‌ళ పుష్ప‌ కూడా పోటీప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం శ‌శిక‌ళ భ‌ర్త లింగేశ్వ‌ర్ ఐదుగురు న్యాయ‌వాదుల‌తో క‌లిసి స్థానిక రాయ‌పేట‌లో ఉన్న అన్నాడీఎంకే కార్యాల‌యానికి చేరుకున్నారు. అనంత‌రం నామినేష‌న్ ప‌త్రాన్ని కొనుగోలు చేశారు. దానిని పూర్తిచేసి శ‌శిక‌ళ పుష్ప త‌ర‌పున నామినేష‌న్ వేసేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా అన్నాడీఎంకే కార్య‌క‌ర్తలు ఒక్క‌సారిగా ఆయ‌న‌పై దాడిచేశారు.

పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న విధ్వంసం సృష్టించేందుకు, గొడ‌వులు పెట్టేందుకే వ‌చ్చార‌ని ఆరోపిస్తూ ముష్టిఘాతాలు కురిపించారు. భ‌ర్త‌పై దాడి జ‌రుగుతున్న స‌మ‌యంలో శశిక‌ళ పుష్ప కార్యాల‌యం బ‌య‌ట కారులోనే ఉన్న‌ట్టు స‌మాచారం. కాగా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుండాలతో తమపై దాడి చేయించారని శశికళ భర్త పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. లేఖ ఇవ్వటానికి వెళ్లిన సమయంలోనే తమకు అడ్డుకుని శశికళ పుష్ప ఎవరు ? ఆమెకు అన్నాడీఎంకే పార్టీకి ఏమి సంబంధం ? ఎందుకు వచ్చారు ? మర్యాదగా వెళ్లిపోండి అంటూ తమను రక్తం వచ్చేటట్లు కొట్టారని ఆయన చెప్పాడంట.

అయితే దాడి తర్వాత త‌న భ‌ర్త క‌నిపించ‌డం లేదంటూ శ‌శిక‌ళ పోలీసుల‌కు ఫిర్యాదు చేయటం గమనార్హం. మ‌రోవైపు అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు కూడా శ‌శిక‌ళ భ‌ర్త‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles