లోకల్ ట్రైన్ కి యాక్సిడెంట్.. అంతా తప్పించుకున్నారు | Five Coaches of Kurla-Ambarnath Local Train Derail Near Thane

Local train derail near thane

Mumbai local derail, Kurla-Ambarnath, Kurla-Ambarnath train, Thane train derail, local train derail, lOcal train Mishap, Mumbai Train Accident, Maharashtra train accident, no causalities train accident

Five coaches of Mumbai local derail near Kalyan, third mishap in less than 40 days.

పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్... అంతా సేఫ్

Posted: 12/29/2016 09:05 AM IST
Local train derail near thane

నెల క్రితం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. నిన్న మళ్లీ ఇంకో రైలు పట్టాలు తప్పి ఇద్దరిని బలి తీసుకుని, పది మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడేలా చేసింది. ఇక ఇప్పుడు మహారాష్ట్ర వంతు వచ్చింది.

మ‌హారాష్ట్ర‌లో థానే లో మ‌రో రైలు ప‌ట్టాలు తప్పింది. అయితే ప్ర‌యాణికులు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. గురువారం తెల్ల‌వారుజామున 5:30 గంట‌ల స‌మ‌యంలో క‌ల్యాణ్‌-విఠల్‌వాడి మ‌ధ్య కుర్ల‌-అంబ‌ర్‌నాథ్ లోక‌ల్ రైలు ప్ర‌మాదానికి గురైంది. ఐదు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాక‌పోవ‌డంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్ర‌మాదం కార‌ణంగా ఈ మార్గంలో రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. అధికారులు కారణాలను అన్వేషిస్తున్నారు. కాగా, 40 రోజుల్లో ఇది మూడో ప్రమాదం కావటంతో రైల్వే మంత్రి సురేష్ ప్రభు రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమైపోతున్నారు. 2012లో రక్షణ చర్యలపై అప్పటి ప్రభుత్వ ఓ కమిటీ వేయటం, అది నివేదిక సమర్పించినప్పటికీ ఆ నివేదిక ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Local Train  derail  Thane  5 coaches  no causalities  

Other Articles