పాత పెద్దనోట్లు ఇంకా వున్నాయా..? అయితే జైలుకే.. penalty for holding old notes, cabinet approves ordinance

Union cabinet approves ordinance to impose penalty for holding old notes

government approves ordinance,last date to submit old notes,demonetisation,demonetisation updates,demonetisation news,last date to deposit old currency,new currency,currency switch,penalty on old currency,narendra modi,pm modi,demonetisation protests,how much old notes can be deposited,business use,,deadline,last date,old currency,old currency deposit,ordinance

Union Cabinet approved promulgation of an ordinance to impose a penalty, including a jail term, for possession of the scrapped 500 and 1,000 rupee notes beyond a cut-off.

పాత పెద్దనోట్లు ఇంకా వున్నాయా..? అయితే జైలుకే..

Posted: 12/28/2016 01:10 PM IST
Union cabinet approves ordinance to impose penalty for holding old notes

ఇంకా మీ వద్ద కేంద్రం రద్దు చేసిన పాత పెద్ద నోట్లు వున్నాయా..? అయితే తస్మాత్ జాగ్రత్తా.. వెంటనే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేయండీ.. లేదంటు మీకు కారాగారవాసం తప్పదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వాటికి అసలు చట్టబద్దత లేకుండా చేసేందుకు కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. 2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. ఇవాళ సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నూతనంగా ఆర్డినెన్స్ను తీసుకువచ్చి.. దానిని అమోదించింది.

ఈ ఆర్డినెన్సు ప్రకారం డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో ఎలాంటి లావాదేవీలు జరిపినా రూ.5వేల వరకు జరిమానా పడనుంది. ఇకపై పాత నోట్లు వుంటే వాటిని ఈ నెల 31 వరకు నేరుగా బ్యాంకుల్లో జమ చేయాల్సి వుంటుంది. అ తరువాత పాత నోట్లు వుంటే ఐదు వేల వరకు జరిమానా విధించనున్నారు. అయితే ఈ లోపుగా పాత నోట్లను కేవలం అర్బీఐ శాఖ కార్యాలయాల్లోనే మార్చుకునే వెసలు బాటును కల్పించారు. అదీనూ వారు అఫిడెవిట్ దాఖలు చేసిన తరువాత మాత్రమే ఈ పాతనోట్లను మార్చుకునే అవకాశాన్ని కల్పించనుంది.

ఈ గడువులోగా కూడా పాతనోట్లను మార్చుకోకుండా ఆ తరువాత కూడా పాత పెద్ద నోట్లతో ఎవరైనా పట్టుబడితే వారికి నాలుగేళ్ల జైలు శిక్ష కూడా విధించే విధంగా చట్టాన్ని తీసుకువచ్చింది కేంద్రం. ఇవాళ సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు తీర్మాణాన్ని అమోదించింది. కాగా ఈ తీర్మాణంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అమోద ముద్ర వేయడమే తరువాయి. హైదరాబాద్ పర్యటనకు వెళ్లిన ప్రణబ్ తిరగి రాగానే ఈ ఆర్డినెన్సుపై సంతకం చేస్తారని, ఆ తరువాత ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles