నగదు రహిత లావాదేవీలకు అధార్ అనుసంధాన యాప్.. NY developer Carl Paladino's 'gorilla' remark spurs outrage

Ny developer carl paladino s gorilla remark spurs outrage

US President Barack Obama, Michelle Obama, Carl Paladino, racial coments

Former New York gubernatorial candidate Carl Paladino is facing backlash on social media for a racist remark about first lady Michelle Obama.

ఒబామా దంపతులపై రిపబ్లికన్ నేత జాత్యాంహకార వ్యాఖ్యలు

Posted: 12/25/2016 07:56 AM IST
Ny developer carl paladino s gorilla remark spurs outrage

అమెరికా అధ్యక్షుడిగా మరికోన్ని రోజుల వ్యవధిలో దిగిపోనున్న బరాక్‌ ఒబామాను ఉద్దేశించి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రిపబ్లిక్ పార్టీకి చెందిన ఓ నేత. అంతటితో అగకుండా ఏకంగా ఆయన సతీమణి మిషెల్లీ ఒబామాపై కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన డోనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో అమెరికా పాలనా పగ్గాలను అందుకోనున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలను అయన పార్టీకి చెందిన ఓ నేత చేయడం కలకలం రేగుతుంది. ఏకంగా అధ్యక్షుడిగా దిగపోనున్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.

2017లో ఒబామా చనిపోవాలని కోరుకుంటున్నానని, ఆయన భార్య మిషెల్లీ ఆఫ్రికా వెళ్లి అక్కడ చింపాంజీతో కలిసి ఓ గుహలో జీవించాల్సిందేనంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. 2017లో ఏం జరిగితే చూడాలని మీరు అనుకుంటున్నారు అని మీడియా ప్రశ్నిస్తే.. ఎద్దుల మందకు వచ్చే భయంకరమైన వ్యాధి అయిన కౌ డిసీజ్‌ ఒబామాకు వచ్చి ఆయనను పరీక్షలకు తీసుకెళ్లడానికి ముందే చచ్చిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు.  న్యూయార్క్‌ మాజీ గవర్నర్ గా సేవలందించిన కార్ల్‌ పలాడినో అనే వ్యాపార వేత్త ఇలా జాతి అహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డాడు.

ఆ తర్వాత మరో ఏడాదిలో మిషెల్లీ ఒబామా తిరిగి తన దేశం ఆఫ్రికా దేశమైన జింబాబ్వేకు వెళ్లి అక్కడే ఓ చింపాంజీతో కలిసి గుహలో జీవించాల్సిందేనంటూ అది తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. ఈ మాటలపై ఒక్కసారిగా నిరసనలు పెల్లుబికాయి. సోషల్‌ మీడియాలో తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి. జాత్యంహకార వ్యాఖ్యలు చేయడంలో ముందునుంచే పలాడినో అతి చేస్తుంటాడని పలువురు మండిపడ్డారు. కాగా, ఇలాంటి వాటిని తాము ఏమాత్రం ప్రోత్సాహించబోమని ట్రంప్‌ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US President Barack Obama  Michelle Obama  Carl Paladino  racial coments  

Other Articles