తీరు మార్చుకోని చింతమనేనిపై కేసు.. case filed against ruling mla chintamaneni prabhakar

Case filed against ruling mla chintamaneni prabhakar

TDP mla, chintamaneni prabhakar, reporter, Man handling, journalists, three town police station, eluru, west godavari, Andhra pradesh

Andhra pradesh west godavari district eluru three town police registered fir against ruling mla chintamaneni prabhakar for manhandling journos

తీరు మార్చుకోని చింతమనేనిపై కేసు..

Posted: 12/23/2016 11:44 AM IST
Case filed against ruling mla chintamaneni prabhakar

తమ ప్రభుత్వం అధికారం వుంది.. తాను ఒక ఎమ్మెల్యేనన్న ఒకే ఒక్క కారణంతో చెలరేగిపోతున్న ప్రభుత్వ విప్, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ పై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన ఎమ్మార్వో వనజాక్షిపై దాడి అంశంలో సాక్షాత్తు టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  జోక్యం కల్పించుకుని ఇరు వర్గాల మధ్య సమోద్య కుదర్చారని.. మండల మెజిస్ట్రేట్ స్థాయి అధికారులతో తనకు వైరం ప్రారంభమైనా తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ధీమా కూడా అయన తన వైఖరి మార్చుకోలేకపోవడానికి కారణమవుతుంది.

ఆ తరువాత ఆయన అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసులపై కూడా తన ప్రతాపాన్ని చాటుకున్నారన్న అరోపణలు వచ్చాయి. పోలీస్ కానిస్టేబుల్ ఏకంగా రక్తపు గాయాలతో స్టేషన్ కు వెళ్లి మరీ పిర్యాదు చేశాడు. తమ శాఖకు చెందిన ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. ఇలా దెందులూరులో తన ఇష్టారాజ్యాన్ని అవలంబిస్తున్నారని విమర్శలు ఎదుర్కోంటున్న చింతమనేని ప్రభాకర్ అటే జర్నలిస్టులతోనూ అదే తీరుతో వ్యవహరించడంతో ఆయనపై కేసు నమోదైంది.

జర్నలిస్టుల ఫిర్యాదుమేరకు చింతమనేనితో పాటు మరో ఇద్దరిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐసీసీ 323, 394, 406, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదయింది. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తుండగా అక్కడికి వచ్చిన చింతమనేని వారిపై చిందులు తొక్కారు. మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తానంటూ హెచ్చరించారు. అయితే అ తతంగాన్నంతా తన కెమెరాలో చిత్రీకరిస్తున్న కడవకొల్లు సాగర్‌ పై అగ్రహం వ్యక్తం చేశారు. తమ విధులు తాము నిర్వహిస్తున్నామన్న జర్నలిస్టులపై దాడికి కూడా పాల్పడ్డారని పాత్రికేయులు అరోపించారు.

దీంతో అధికార ఎమ్మెల్యే చింతమనేనిపై జర్నలిస్టులు పిర్యాదు చేయగా, వారి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐసీసీ 323, 394, 406, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జర్నలిస్టులపై చింతమనేని దాడి చేయడాన్ని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ ఫోరం, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఖండించారు. చింతమనేని అరెస్ట్ చేయాలని కోరుతూ దశలవారిగా ఉద్యమం చేపట్టాలని జర్నలిస్టులు నిర్ణయించారు. రిపోర్టర్‌పై దాడిని వ్యతిరేకిస్తూ ఇవాళ ఏలూరు త్రీటౌన్ పీఎస్ ఎదుట ధర్నా జర్నలిస్టులు అందోళన చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles