ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ, రాహుల్ మాటలయుద్దం Rahul Gandhi hits back at PM Modi’s ‘packet’ jibe

No chance of earthquake now that he has spoken pm modi

Narendra Modi, Congress, Manmohan Singh, Rahul Gandhi, Varanasi, BHU, demonetisation, poverty, corruption, India, PM ridicules Rahul's 'quake' remark, questions Manmohan's political legacy,news, India news,Politics News, latest news

PM Modi said he is happiest since the Congress leader has "learnt" to speak as he has unwittingly admitted the "failure" of his party's reign.

ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ, రాహుల్ మాటలయుద్దం

Posted: 12/22/2016 04:24 PM IST
No chance of earthquake now that he has spoken pm modi

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీలు ఇద్దరు మాటల యుద్దానికి దిగారు. రాష్ట్రస్థాయి నేతలు ఎన్నికల సంగ్రామానికి అజ్యం పోయాల్సిన వేళ ఏకంగా జాతీయ నాయకులు.. అక్కడ వేడిని రాజేశారు. ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో సహారా గ్రూపు నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని రాహుల్ గాంధీ చేసిన అరోపణలను టార్గెట్ చేసిన ప్రధాని ఆయనపై వారణాసి కేంద్రంగా వ్యంగోక్తులు విసిరారు.

వారణాసీలో కాన్సర్ అసుపత్రికి శంఖుస్థాపన చేసిన ప్రధాని.. అసందర్భవ్యాఖ్యలు చేశారు. మేధావులతో కూడిన హాలులో రాజకీయ అంశాలను ప్రస్తావనకు తీసుకువచ్చారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పేర్లను ప్రస్తావించకుండా ప్రధాని కౌంటర్ వేశారు. వారికి ఒక యువనేత వున్నాడు. అతడు ఎలా మాట్లాడలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. అయన మాట్లాడటం వస్తే నేను చాలా సంతోషిస్తానని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అయన ఏ జేబులో ఏముందో కూడా చెప్పలేక అందుకు మాటలు రాక ఇబ్బందులు పడ్డారని మోడీ ఎద్దేవా చేశారు. అయితే యువనేత మాట్లాడి వుండకపోతే భూకంపం వచ్చేదేమోనని, దానిని మరో పదేళ్ల పాటు ప్రజలు అనుభవించాల్సి వచ్చేదేమోనన్న అందోళన కలిగేది. కానీ యువనేత మాట్లాడటం మొదలుపెట్టాడు.. కానీ ఇప్పటికైతే భూకంపం రాలేదని వ్యంగోక్తులు విసిరారు.

ఇదే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని బెహ్రాయిచ్ లో అక్రోశ్ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న యువనేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్రమోడీ విమర్శలను తిప్పికోట్టారు. తన జేబుల్లో ఏముందన్న విషయాన్ని తరువాత చూద్దామన్న ఆయన మీ జేబుల్లో సహారా, బిర్లాలు ఇచ్చిన ముడుపులను పెట్టుకోలేదా..? అని సూటిగా ప్రశ్నించారు. తనపై ఎంతకావాలనుకుంటే అంతగా వ్యంగోక్తులు వేసుకోవచ్చని, దానిని తాను అడ్డుకోనని కానీ తాను అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

తాను అడిగిన ప్రశ్నలను దాటవేసే ధోరణిలో ప్రధాని నరేంద్రమోడీ కొత్త ఒరవడిని పాటిస్తున్నారని, తనను చులకన చేయడంతో తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం దాటవేసత్ున్నారని అన్నారు. ఇక సూటిగా అడుగుతున్నా.. ప్రధాని గారూ.. మీరు సహారా.. బిర్లా కంపెనీల నుంచి ముడుపులు అందాయా..? లేదా..? మీరు అవినీతిక ిపాల్పడ్డారా లేదా..? కొంతతిరుగుడు కట్టిపెట్టి సూటిగా సమాధానం చెప్పండంటూ డిమాండ్ చేశారు. పేద ప్రజలను వారి డబ్బులు వారు వాడుకోనీయకుండా రాచిరంపాన పెట్టమే మోడీ సర్కారు ఉద్దేశ్యమా అని నిలదీశారు. అంతకుముందు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో మోడీ అవినీతికి సంబంధించిన అదాయశాఖ సీజ్ చేసిన డాక్యూమెంట్లను రాహుల్ అప్ లోడ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Manmohan Singh  Rahul Gandhi  Varanasi  Congress  BJP  

Other Articles