మొత్తం 70 కోట్లు.. బ్యాంకుకు కాదు.. ఆయన ఇంటికి వచ్చేశాయ్ | 70 crores 2000 notes found in shekar reddy house.

New notes found in shekar reddy house

TTD Shekar Reddy, 2000 notes bundle, 70 crores new notes, TTD ex member Shekar Reddy, Shekar Reddy scam, Shekar Reddy IT Raids, New Notes Press, Printing Press officials Shekar Reddy, New Notes Scam Printing Press, printing press officials scam

TTD ex member Shekar Reddy received new notes from printing press officials.

70 కోట్ల కొత్త నోట్లు డైరక్ట్ గా ఆయన ఇంటికే...

Posted: 12/15/2016 08:08 AM IST
New notes found in shekar reddy house

టీటీడీ బోర్డు మాజీ మెంబర్ శేఖర్ రెడ్డి స్కాం లో విచారణ ముమ్మరం చేశారు అధికారులు. ఇప్పటిదాకా సీజ్ చేసిన సొమ్ముతోపాటు, బినామీల పేరుతో మరో ముప్పై కోట్లు బయటపడినట్లు తెలుస్తోంది. కోట్ల కోట్ల నగదు, కేజీల కొద్దీ బంగారంతో పట్టుబడిన శేఖర్ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. దీని వెనుక బ్యాంకు అధికారుల హస్తం ఉందని భావించిన నిఘా విభాగం ఆ దిశగానే విచారణ జరపగా, ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

బ్యాంకుల నుంచి కాకుండా నేరుగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే కొత్త కరెన్సీ అందినట్టు సమాచారం. ఈ విషయంలో పదిమంది అధికారులు సహకరించినట్లు సమాచారం. శేఖరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రేమ్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి ఇళ్లపై ఇటీవల దాడులు నిర్వహించిన ఆదాయపు పన్నుశాఖ అధికారులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదులో రూ.34 కోట్ల విలువైన కొత్త రూ.2 వేలు నోట్లు ఉన్నాయని అధికారికంగా చెబుతుండగా వాటి విలువ రూ.70 కోట్లని అనధికారిక సమాచారం.

కొత్త 2 వేల నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా అవి శేఖరరెడ్డి ఇంటికి చేరుకున్నాయని తేలింది. నిజానికి నిజానికి ఈ నోట్లు మొదట ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బీఐకి, అక్కడి నుంచి వివిధ బ్యాంకులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు, ఆలస్యాన్ని నివారించేందుకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి కరెన్సీని నేరుగా విశాఖపట్టణం, హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ ప్రత్యేక శాఖ(స్కేప్)లకు పంపారు. ఇదే అదనుగా భావించిన కొందరు అధికారులు స్కేప్‌లకు చేరిన కొత్త కరెన్సీని దారి మళ్లించి నేరుగా శేఖరరెడ్డికి పంపినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shekar reddy  New notes Press  70 crores new notes  

Other Articles