ఎస్బీఐ ఏటీయం నుంచి నకిలీ రూ.2000 నోటు.. ATM dispenses 'fake' Rs 2000 note in Sitamarhi

Atm in bihar closed after complaint of fake rs 2000 note

State Bank of India, Pankaj Kumar, sudhanshu kumar rao, fake 2000 note, demonetisation of currency, currency ban, Simra village, Sitamarhi district, Dumara police station, Demonetisation, patna, Bihar, crime news

State Bank of India (SBI) officials in Bihar's Sitamarhi district scrambled to seal an ATM after a customer complained that the bank ATM dispensed a fake Rs 2000 note

ఎస్బీఐ ఏటీయం నుంచి నకిలీ రూ.2000 నోటు..

Posted: 12/14/2016 08:03 PM IST
Atm in bihar closed after complaint of fake rs 2000 note

నకిలీ నోట్లను, నల్లధనాన్ని.. వీటితో పెరుగుతున్న అవినీతిని ఒక్క దెబ్బతో నిర్మూలిస్తామంటూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం.. ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో విఫలమౌతుందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. కొత్త నోట్లను పాకిస్థాన్ ముద్రించలేదని, ధీమా వ్యక్తం చేస్తూ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్ లోనే ముద్రించలేని నోటును.. దేశంలోని అక్రమార్కులు ఎలా ముద్రిస్తారన్న సందేహాలను పటాపంచలు అయ్యేలా వున్నాయి.

అయితే మన దేశంలోని కేటుగాళ్లు. డూఫ్లికేటు నోట్లను ఏకంగా తయారు చేయడంతో పాటు వాటిని ఏటీయంలో పెట్టడంలోనూ సక్సెస్ అయ్యారు. ఇప్పటికే ఈ సందేహాలకు ఆజ్యం పోస్తూ భారీ మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు ఐటీ రైడ్స్లో దొరకడం, అక్కడక్కడా నకిలీ కొత్త నోట్లు వెలుగులోకి రావడం జరుగుతోంది. తాజాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి నకిలీ కొత్త రూ.2000 కరెన్సీ నోటు బయటికి వచ్చింది. ఇప్పటి వరకు ఈ నోటుకు చిల్లర కష్టం మాత్రమే వుంటే.. తాజాగా నకిలీలు కూడా వున్నాయన్న వార్త దవనాంలా వ్యాపించింది. దీంతో ఎస్బీఐ బ్యాంకు సదరు ఏటీయం కేంద్రాని తాత్కాలికంగా మూసివేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఎస్బీఐ ఏటీఎంలో నగదు డ్రా చేసుకున్న సీతామహ్రి జిల్లా లంగ్మా ప్రాంతానికి చెందిన పంకజ్ కుమార్ అనే వ్యవసాయదారుడికి అచ్చం ఒరిజినల్ నోటు మాదిరి నకిలీ కొత్త రూ.2000 నోట్లు డ్రా అయినట్టు తెలిసింది. వేరే వ్యక్తికి ఈ నోటును అందించినప్పుడు ఇది నకిలీ నోటని అతను తిరస్కరించడంతో ఆశ్చర్యానికి గురైనట్టు పంకజ్ తెలిపాడు. వెంటనే మరుసటి రోజు బ్యాంకుకి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నాడు.  అదేవిధంగా డుమ్రా పోలీసు స్టేషన్లోనూ దీనిపై ఫిర్యాదుచేసినట్టు చెప్పాడు.

పంకజ్ ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని డుమ్రా పీఎస్ విజయ్ బహదూర్ సింగ్ తెలిపారు. ఎక్కడైతే పంకజ్ నకిలీ నోటు విత్డ్రా చేసుకున్నాడో ఆ ఏటీఎం ఖజానా ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుందని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సుధాంశు కుమార్ రావు తెలిపారు. ఏటిఎం ఖజానా లోపల కరెన్సీని ప్రైవేట్ సంస్థ అధికారులు సమక్షంలో బ్యాంకు అధికారులు తనిఖీ చేస్తారని ఆయన చెప్పారు. ఆ సమయంలోనే వాటికి సీల్ కూడా వేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏటీఎం నుంచి నకిలీ నోటు విత్డ్రా అ‍య్యేందుకు ఆస్కారం ఉండదని పేర్కొంటూ ఈ విషయాన్ని రావు తోసిపుచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  Pankaj Kumar  sudhanshu kumar rao  fake 2000 note  Simra village  Sitamarhi district  Bihar  crime news  

Other Articles