కేబినెట్ మీటింగ్ నుంచి సీఎం వాకౌట్.. Mehbooba Mufti Walks Out Of Cabinet Meeting

Furious cm walks out of cabinet meeting after rift with ministers

Mehbooba Mufti, Jammu and Kashmir, PDP-BJP Alliance, BJP in Kashmir, Kashmir Police, Kashmir Police Restructuring

In a first major rift within the ruling alliance in Jammu and Kashmir, Chief Minister Mehbooba Mufti walked out of a cabinet meeting over differences with BJP ministers.

కేబినెట్ మీటింగ్ నుంచి సీఎం వాకౌట్..

Posted: 12/10/2016 06:49 PM IST
Furious cm walks out of cabinet meeting after rift with ministers

వినడానికే విచిత్రంగా వుంది కదూ. కానీ ఇది నిజం. ప్రభుత్వం తీరు నచ్చకో, లేక వ్యవహరశైలి నచ్చకో అది కాకపోతే ప్రభుత్వ కార్యక్రమాలను ఎండగడుతూనో అసెంబ్లీ నుంచో లేక ఏదైనా చర్చాగోష్టి నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేస్తాయి. కానీ మంత్రివర్గ సమావేశం జరుగుతున్నప్పుడు.. మంత్రులతో వచ్చిన విభేదాల కారణంగా ఏకంగా ముఖ్యమంత్రే ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారంటే ఎవరు మాత్రం విస్మయానికి గురికారు. అయితే ఇక్కడ గతంలో అటు కేంద్రంలో కానీ, లేక ఇటు రాష్ట్రాల్లో కానీ పోత్తుతో నడిచిన ప్రభుత్వాలను శ్లాఘించాల్సిందే.

ఎందుకంటే అన్ని వర్గల పార్టీతో మధ్యంతర ఎన్నికలకు వెళ్లకుండా, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కాకుండా ఐదేళ్లు పాలన అందించడమంటే అంత సులువైన పని కాదన్నది ఇప్పుడు అర్థమవుంతుంది. ఎందువల్ల అంటే జమ్మాకాశ్మీర్ లో పీడిపి ప్రభుత్వానికి మద్దతనిస్తున్న బీజేపి మంత్రులు అక్కడ ఎదుర్కోంటున్న పరిస్థితి సరిగ్గా ఇలాంటిదే. వారికి నచ్చని నిర్ణయానికి పీడిపీ ప్రభుత్వం ఒత్తిడి చేయడం.. ఈ నేపథ్యంలో ఇరువర్గల మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లడం.. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అగ్రహంతో ఏకంగా క్యాబినెట్ బేటీ నుంచి వెళ్లిపోయారు.  

కశ్మీర్ పోలీస్ సర్వీస్.. కేపీఎస్‌ను పునర్వ్యవస్థీకరించే విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. పునర్వ్యవస్థీకరణకు ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ సహా బీజేపీ మంత్రులంతా ససేమిరా అనడంతో మెహబూబా ముఫ్తీ (57)కు ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో ఒక్క ఉదుటన లేచి, సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత బీజేపీ మంత్రులంతా కలిసి ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. దీనిపై మరింత గొడవ జరగకుండా ఉండేందుకు కొంతమంది బీజేపీ మంత్రులు సీఎం నివాసానికి హుటాహుటిన వెళ్లారు. జమ్ము కశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఈ రెండు పార్టీలు కలిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles