క్యూ లోంచి లాగి మరీ పిచ్చి కొట్టుడు కొట్టాడు | Ex Armyman In Bank Queue beat by cop.

Cop slaps ex armyman in bank queue in karnataka

Ex Armyman, Bank Queue, Karnataka Cop Slap, Cop Slaps Ex Armyman, In Bank Queue Man slap, Man slapped in Queue, Man beat by Police, Bank Queue man beat, Baglakot Bank Beat video

Karnataka Cop Slaps Ex Armyman In Bank Queue later suspended.

ITEMVIDEOS:బ్యాంకు క్యూ నుంచి లాగి ఫటా ఫటా బాదాడు...

Posted: 12/09/2016 12:32 PM IST
Cop slaps ex armyman in bank queue in karnataka

కరెన్సీ కష్టాలకు ఎదురీదుతు బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు జనాలు పడిగాపులు పడుతున్న సీన్లు ఇంకా ఎన్ని రోజులు దర్శనమిస్తాయో ఖచ్చితంగా చెప్పలేం గానీ, అలా క్యూ లో నిలుచున్న వారి సహనానికి కొన్ని చిక్కులు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో జనాలు పిట్టల్లా రాలిపోతుంటే, వారి పట్ల సిబ్బంది, భద్రతగా వచ్చిన పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా బెంగళూరులో చోటుచేసుకున్న ఓ ఘటనపై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. బంగ్లాకోట్ లో ఓ బ్యాంకు వద్ద క్యూ లో నిలుచున్న వృద్ధుడిపై ఓ పోలీస్ ముష్టిఘాతాలు కురిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. బ్యాంకు బయట నోట్ల కోసం క్యూ భారీగా ఉంది. ఉదయం బ్యాంకు ఓపెన్ చేయడానికి రాగానే స్వల్ఫ తోపులాట జరిగింది. అయితే అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి లైన్ లో మొదటగా నిలుచున్న నందప్ప అనే మాజీ ఆర్మీ ఉద్యోగి పై విరుచుకుపడ్డాడు.

 

లైన్ లోంచి లాక్కొచ్చి మరీ ఐదుసార్లు పిడిగుద్దులు కురిపించాడు. అక్కడే ఉన్న వారు ఆ ఘటనను అడ్డుకోకపోగా, వీడియోలు తీస్తూ ఆనందించారు. చివర్లో కుప్పకూలిన ఆ వృద్ధుడికి వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆ ఖాకీ. ఇదంతా అక్కడి సీసీపుటేజీలో నమోదు కావటం, ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో అతన్ని సస్పెండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Baglakot Police  Bank Queue  EX Army man slap  

Other Articles