‘మన్నార్ గుడి’ మాఫియా మొదలుపెట్టేసింది | Mannargudi mafia details.

Mannargudi mafia time starts in tamil nadu

Tamil Nadu Politics, Sasikala Natarajan's G-18, Mannargudi mafia members, post-Jaya Tamil Nadu, Sasikala Natarajan family, Jalalithaa Sasikala Natarajan

Meet Mannargudi mafia the family likely to rule post-Jaya Tamil Nadu.

అమ్మ ప్లేస్ లో చిన్నమ్మ! అసలేం జరుగుతోంది?

Posted: 12/09/2016 09:56 AM IST
Mannargudi mafia time starts in tamil nadu

మన్నార్ గుడి మాఫియా.. ఇదేదో కరడుగట్టిన నేరగాళ్ల గ్రూపు అనుకోకండి. ఎందుకంటే చాలా పాపులర్ తలలే భాగస్వాములుగా ఉన్నాయి. దివంగత జయలలిత వ్యక్తిగత సహయకురాలు శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాహరన్, ఇళవరసి, ఆమె కుమారుడు వివేక్, సోదరి ప్రియ, మేనల్లుళ్లు వెంకటేష్, మాధవన్, ఆమె మేనకోడలి భర్త శివకుమార్... ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇలా వ్యవహరిస్తుంటారు. శశికళ స్వగ్రామం అయిన తిరువూరు జిల్లా మన్నార్ గుడి పేరు మీద ఈ పేరు వాడుకలోకి వచ్చింది లేండి.

ప్రస్తుతం వీరంత పోయిస్ గార్డెన్ లో హల్ చల్ చేస్తున్నారు. గతంలో వీరంతా జయ కాంపౌండ్ లోనే ఉండేవారు. శశితో సమానంగా వారందరినీ తనవాళ్లుగా అమ చెంతకు చేర్చుకుంది కూడా. అయితే ఆపై జరిగిన పరిణామాలే కలత చెందేలా చేశాయి. అక్రమాలు, అవినీతి ఆరోపణలు, పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలు ఇలాంటి వాటితో జయ వారందరిని దూరం పెట్టేసింది.

మరి ఇక ఇప్పుడు జయ లేదు కాదా. అందుకే నెచ్చెలి శశికళ, తన భర్త సహా బంధువర్గాన్నంతటినీ వేద నిలయంలోకి అనుమతించేస్తోంది. అయితే తనవారిని ఆమె పిలుచుకోవడం పట్ల అభ్యంతరాలు లేకున్నా... ఆరోపణలు ఉన్నవారిని తీసుకోవటాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.

ఇక చిన్నమ్మగా శశికళను వ్యవహరిస్తూ ఆమె దర్శనం కోసం నేతలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నుంచి పోటీ చేసేందుకు కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు  సీఎం పన్నీర్ సెల్వంతో సహా కీలక మంత్రులంతా ఇప్పుడు వేదనిలయం దగ్గర శశికళ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. భవిష్యత్తులో అన్నాడీఎంకే పగ్గాలు ఆమెకే అప్పజెప్పే అవకాశాలు ఎక్కువగా ఉండటంతోనే ఇలాంటి సీన్ తమిళ రాజకీయాల్లో దర్శనమిస్తోంది.

మరోవైపు అనారోగ్యంతో ఉన్న సమయంలో తన ఫోటో విడుదల చేయాలంటూ జయలలిత వైద్యులకు సూచించినప్పటికీ, ప్రజలు ఆందోళన చెందుతారన్న సాకుతో శశికళ ఆ చర్యను అడ్డుకుందన్న వార్త ఒకటి బయటికి పొక్కి కలకలం రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu Politics  Jayalalithaa Era  Sasikala Natarajan  Mannargudi mafia  

Other Articles