ఉచిత ఆఫర్ తో వచ్చిన బీఎస్ఎన్ఎల్.. జియోకు చెక్ BSNL to launch free unlimited mobile calls plan at Rs 149

Bsnl to launch free unlimited mobile calls plan at rs 149

BSNL,unlimited calls plan,BSNL unlimited voice calls plan,unlimited calls recharge,rs 149 plan,BSNL Rs 149 recharge,BSNL Rs 149 plan,unlimited talktime,Reliance Jio Rs 149 plan

Reliance Jio's free voice call service has been plagued by call drop issues, BSNL looks set to compete with it through an unlimited voice call tariff initiative starting at Rs 149 per month.

ఉచిత ఆఫర్ తో వచ్చిన బీఎస్ఎన్ఎల్.. జియోకు చెక్

Posted: 12/06/2016 12:46 PM IST
Bsnl to launch free unlimited mobile calls plan at rs 149

ఉచిత వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 1జీబి డాటాను కూడా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటుతో దేశంలోని టెలికామ్ రంగాన్ని కుదిపేసిన రిలయన్స్ జియో.. మార్చి 2017 నాటికి 20 కోట్ల మంది కస్టమర్లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అత్యంత చౌకగా 4జీ ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో జియో పోటీని తట్టుకునేందుకు వీలుగా దేశీయ టెలికాం కంపెలు అనేక ఆఫర్లతో ముందుకువస్తున్నాయి.

తాజాగా జియో లక్ష్యచేధనకు ప్రభుత్వ టెలికామ్ దిగ్గజ సంస్థ బీఎస్ఎన్ఎల్ చెక్ పెట్టేందుకు సిద్దమైంది. కొత్త సంవత్సరం నుంచి సరికొత్త రూ. 149 ప్లాన్ ను తన కస్టమర్లకు తీసుకురానుంది. ఈ ప్లాన్ ప్రకారం తమ కస్టమర్లకు నెలకు అన్ లిమిటెడ్ ఉచిత వాయిస్ కాల్స్ తో పాటు 300 ఎంబి డాటాను కూడా అందించనుంది. నెల రూ 149 వద్ద భారతదేశం అంతటా ఏ నెట్వర్క్ వద్ద మొబైల్ చందాదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ ప్రారంభించనుంది.

ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ కొత్త పథకం వివరాలను మీడియాకు తెలిపారు.  జియో వ్యూహాత్మక ధరలు, ప్రధాన ప్రత్యర్థులు భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్,  ఐడియా సెల్యులార్ ఆఫర్ల నేపథ్యంలో కొత్త  చందాదారులను  ఆకట్టుకోవడంతోపాటు ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలబెట్టుకోవడంపై దృష్టిపెట్టినట్టు ఆయన చెప్పారు. జియో 28-రోజుల వాలిడిటీతో, 300 ఎంబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్,  100 లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్ లను రూ.149 రీచార్జ్ ప్లాన్ కు ధీటుగా ఈ పథకాన్ని తీసుకురానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSNL  unlimited calls plan  BSNL Rs 149 plan  300MB data free  

Other Articles