టీఆర్పీ మోజే ఈ దారుణాలకు కారణం? | Rahul Gandhi criticise PM Modi on TRP politics.

Rahul gandhi about pm modi trp politics

AICC Rahul Gandhi, Rahul Gandhi at CPP meeting, Rahul Gandhi TRP politics, Modi Image Khaidi, Modi Image Prisoner,

Rahul Gandhi at CPP PM Modi’s TRP politics has caused India tremendous damage.

మోదీ ఇమేజ్ తోనే సైనికులు చనిపోతున్నారు

Posted: 12/02/2016 12:55 PM IST
Rahul gandhi about pm modi trp politics

సొంత ఇమేజ్ చట్రంలో బందీ అయిపోవటంతో ప్రదాని మోదీ ఏం చేయలేకపోతున్నారని ఆరోపిస్తున్నాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. అధినేత్రి సోనియాగాంధీ అస్వస్థతో ఉండటంతో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశానికి రాహుల్ అధ్యక్షత వహించాడు. ఈ సందర్భంగా మోదీపై ప్రస్తుత పరిస్థితులను అన్నింటిని కలగలుపుకుని విమర్శలు గుప్పించాడు.

తన సొంత ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజల బాగోగులను పూర్తిగా విస్మరించారని రాహుల్ ఆరోపించాడు. ఆయనకు టీఆర్పీ రాజకీయాలపైనే ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోందని, ఇమేజ్ చట్రంలో ఖైదీగా ఉండిపోయారన్నాడు. మోదీ వచ్చిన తరువాత సరిహద్దుల్లో కాల్పులు పెరిగాయని, 80 మంది సైనికులు వీరమరణం పొందారని తెలిపారు. బీజేపీ వైఖరి కారణంగానే కాల్పుల ఘటనలు పెరిగాయని తెలిపారు.

"ప్రధాని రాజకీయ శూన్యత ఏర్పడేందుకు కారణమయ్యారు. దీంతో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగించే వీలు కలిగింది. దీనికి మూల్యం చెల్లిస్తున్నది ఎవరు? ప్రధాని కాదు, రక్షణ మంత్రి కాదు. మన సైన్యం, వారి కుటుంబాలు మూల్యం చెల్లిస్తున్నాయి. దాదాపు దశాబ్దకాలంలో ఎన్నడూ లేనన్ని సైనిక మరణాలు ఇటీవలి కాలంలో సంభవించాయి" అని రాహుల్ అన్నారు. మోదీ వైఖరితో కలిగిన నష్టాన్ని భవిష్యత్తులో చరిత్రే తేలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరించే వారితో చేతులు కలిపి జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ ప్రయోజనాలను మోదీ పొందుతున్నారని, ఇప్పుడా వ్యక్తే, కాశ్మీర్ మండుతుంటే, స్పందించడం లేదని ఆరోపించాడు. మొత్తానికి తొలిసారి మినీ పగ్గాలు చేపట్టిన రాహుల్ మోదీపై తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  PM Modi  TRP politics  

Other Articles