ఫేస్ బుక్ లో మేకప్ ఆర్టిస్ట్ తో ఫ్రెండ్ షిప్.. మత్తుమందిచ్చి ఫోటోలు తీశాడు | Mumbai based make-up artist cheated.

Mumbai based make up artist cheated by fb friend

make-up artist rape, Facebook Blackmail, Mumbai based make-up artist, Facebook cheating, Indian Woman filmed, FB friend filmed, Girl Blackmail FB friend, Facebook friend blackmail

Mumbai-based make-up artist raped, blackmailed by Facebook friend.

ఫేస్ బుక్ ఫ్రెండ్ ను దారుణంగా మోసం చేశాడు

Posted: 12/02/2016 01:46 PM IST
Mumbai based make up artist cheated by fb friend

ముక్కు మొహం తెలీని మనుషులను సోషల్ మీడియాలు ఫ్రెండ్స్ గా మార్చేస్తున్నాయి. జనరేషన్ అప్ డేట్ అంటూ కొత్త వాళ్లతో సాన్నిహిత్యం చేయటం, ఆపై మోసపోయి బాధపడే ఘటనలు తరచూ చూస్తున్నాం. ఫేస్‌బుక్‌ పరిచయమైన స్నేహితురాలికి మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి ఆపై నగ్న ఫొటోలు తీసిన కేసులో 25 ఏళ్ల ఓ యువకుడిని అరెస్ట్ చేశారు అశోక గార్డెన్స్ పోలీసులు.

ముంబైకి చెందిన మేకప్ ఆర్టిస్ట్ అయిన ఆ యువతి (22)కి ఫేస్ బుక్ లో భోపాల్ కి చెందిన సదరు యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం నమ్మకంగా స్నేహం కొనసాగించిన యువకుడు కలుద్దామంటూ ప్రపోజల్ పెట్టాడు. గత శనివారం వీరిద్దరు బోఫాల్ లో ఓ హోటల్ లో కలుసుకున్నారు. కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చిన ఆ యువకుడు యువతి స్పృహ కోల్పోగానే తన రూం కి తీసుకెళ్లాడు. ఆపై ఆమె వస్త్రాలను విప్పేసి నగ్నంగా ఫోటోలు, వీడియో తీశాడు. కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకి రాగా, అమిత్‌ అనుచితంగా ప్రవర్తించబోయాడు. ఆమె అరవటానికి ప్రయత్నించటంతో ఆ ప్రయత్నానికి మానుకోని విషయం బయటకు చెబితే ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు.

ఆపై బాధితురాలు దగ్గరి నుంచి లక్షా యాభై వేలు కూడా వసూలు చేశాడు. చివరికి పోర్న్ సైట్ లో ఆ వీడియోలను అప్ లోడ్ చేయగా, అవి యువతి కుటుంబ సభ్యుల దృష్టిలో పడ్డాయి. దీంతో అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పిన యువతి పోలీస్ ఫిర్యాదు చేసింది. ఆపై మరోసారి కలవాలంటూ యువతికి అతగాడు ఫోన్ చేయగా, వల పన్ని పోలీసులు పట్టేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  Make Up artist  cheat  filmed  

Other Articles