టీమిండియాకు 103 పరుగల విజయలక్ష్యం England set 103-run target for India

England set 103 run target for india

india vs england, virat kohli, kohli, mohali test, joe root, root, kevin pietersen, pietersen, kp, virat kohli vs joe root, kohli vs root, india vs england, ind vs eng, england vs india, cricket, cricket news, sports, sports news

Despite a defiant half-century from Haseeb Hameed produced in difficult conditions, England were bowled out for 236 runs in their second innings on the fourth day of the third cricket Test

టీమిండియాకు 103 పరుగుల విజయలక్ష్యం

Posted: 11/29/2016 02:49 PM IST
England set 103 run target for india

మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టీమిండియాకు స్వల్ప విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇన్నింగ్స్ విజయం అందుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోహ్లీ సేనకు ఆశలు అడియాశలయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టు టాప్ అర్డర్ తో పాటు చివర్లో కూడా చక్కని బాగస్వామ్యం లభించడంతో 236 పరుగులను సాధించింది. ఓపెనర్ జో రూట్(78), హషిబ్ హమిద్(59 నాటౌట్), వోక్స్(30)లు భారత బౌలర్లను నిలువరించే యత్నం చేయడంతో మొత్తానికి 236 పరుగుల వద్ద ఇంగ్లాండ్ చాపచుట్టేసింది.

అయితే హమిద్ తో కలిసి 47 పరుగులు జత చేసిన తరువాత ఓవర్ నైట్ ఆటగాడు జో రూట్ ఏడో వికెట్ గా పెవీలియన్ దారి పట్టాడు. ఆ తరుణంలో హమిద్-వోక్స్ మద్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది, దీంతో ఈ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేసింది. ఈ జంట 43 పరుగులు జోడించిన తరువాత వోక్స్ ఔటై వెనుదిరిగాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రషిద్ డకౌట్ గా అవుటయ్యాడు. కాసేపటికే జేమ్స్ అండర్సన్(5) రనౌట్ కావడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది.

భారత బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్లకు తలో రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 417 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఐదు టెస్టుల సిరీస్ లో రెండో విజయాన్ని అందుకునేందుకు టీమిండియా బ్యాటింగ్ బరిలోకి దిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  Team india  test series  mohali test  

Other Articles