వాట్సాప్ లో రేప్ వీడియోలు ఎవరూ నోరూ మెదపరేం? | Rape videos on WhatsApp no response.

Sc raps government for not filing reply on whats app rape videos

SC Rape Videos, Supreme Court of India, Whats app Rape videos, Supreme Court Raps on Rape Videos, Supreme Court Central Government, Prajwala NGO, Prajwala Founder, Prajwala Sunitha Krishnan

Supreme Court Raps Government for Not Filing Reply on Whats app Rape videos.

వాట్సాప్ లో అశ్లీల వీడియోలు ఇంకెంత కాలం?

Posted: 11/22/2016 08:17 AM IST
Sc raps government for not filing reply on whats app rape videos

మైక్రోబ్లాంగింగ్ సైట్ వాట్సాప్‌లో అత్యాచార వీడియోల నియంత్ర‌ణ‌పై ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం 11 నెల‌లుగా నోరు మెద‌క‌పక‌పోవ‌డంపై అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేంద్రానికి మొట్టికాయ‌లు వేసింది. సైబ‌ర్ నేరాల కేసుల దర్యాప్తుపై స్ప‌ష్ట‌మైన విధివిధానాలు రూపొందించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టింది.

సామాజిక మాద్యమాల్లో ఇలాంటి వీడియోలు, అశ్లీల దృశ్యాలు ప్రచారం అవుతుంటే ఏం చేస్తున్నారు? మీకు 11 నెలల గడువు కూడా చాలలేదా? అని కేంద్రం తరపున హాజరయిన న్యాయవాది బాల సుబ్రహ్మణ్యంను ప్రశ్నించింది. అయితే పార్లమెంట్ లో విధినిర్వహణలో అధికారులు బిజీగా ఉన్నారని, దీనికి కాస్త గడువు ఇవ్వాలంటూ ఆయన బెంచ్ కోరాడు. వెంటనే బెంచ్ వారు బిజీగా ఉన్నారంటే.. మేం ఇక్కడ ఖాళీగా ఉన్నామా? ఇది సరైన వైఖరి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసును వాయిదా వేసింది.

వాట్సాప్‌లో అత్యాచార వీడియోలు ప్ర‌చారం కావ‌డంపై హైద‌రాబాద్‌కు చెందిన స్వ‌చ్ఛంద సంస్థ 'ప్ర‌జ్వ‌ల' గ‌తంలో సుప్రీంకోర్టుకు లేఖ‌రాసింది. ఈ లేఖ‌తోపాటు వాట్సాప్‌లో ప్ర‌చారంలో ఉన్న రెండు అత్యాచార వీడియోల‌ను పెన్ డ్రైవ్‌ ద్వారా అప్ప‌టి చీఫ్ జ‌స్టిస్ హెచ్.ఎల్.దత్తుకు పంపించింది. కోర్టు దీనిని సుమోటోగా స్వీక‌రించింది. కేసు ద‌ర్యాప్తు చేసి నిందితుల‌ను అదుపులోకి తీసుకోవాల‌ని ఆదేశించింది.

అలాగే సామాజిక మాధ్యమాల్లో అశ్లీల దృశ్యాలు ప్ర‌చారం కాకుండా నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార‌శాఖ‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీ చేసి 11 నెల‌లు గ‌డుస్తున్నా కేంద్రం నుంచి ఎటువంటి స‌మాధానం రాక‌పోవ‌డంపై జ‌స్టిస్ ఎంబీ లోకూర్‌, జ‌స్టిస్ యూయూ ల‌లిత్‌తో కూడి ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశిస్తూ శుక్ర‌వారానికి కేసును వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Prajwala petition  Rape Videos  Whats app  Central Government  

Other Articles