భారీ భూకంపం.. మళ్లీ సునామీ వస్తుందా? | Massive Earthquake Hits Japan and tsunami alert announced.

Massive earthquake hits japan

Japan Earthquake, Japan Tsunami, northeastern Japan, 6.9 earthquake, Massive Earthquake, Japan Tsunami, Fukushima nuclear power plant

A powerful 6.9-magnitude earthquake hit northeastern Japan on Tuesday triggering a one-metre (3.3-foot) tsunami wave that crashed into the coast at the stricken Fukushima nuclear power plant.

భారీ భూకంపం.. సునామీ అలలు!

Posted: 11/22/2016 07:38 AM IST
Massive earthquake hits japan

శక్తివంతమైన భూకంపం మంగళవారం ఉదయం జ‌పాన్‌ను అతలాకుతలం చేసింది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఈ తెల్లవారుజామున 5:59 గంట‌ల‌కు6.9 తీవ్ర‌త‌తో భారీ భూకంపం సంభ‌వించింది. మీటర్ ఎత్తు అలలు ఎగిసిపడుతుండటంతో సునామీ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లాలంటూ జ‌పాన్ వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

భూకంప కేంద్రం టోక్యోలో ఉన్న‌ట్టు గుర్తించామ‌ని, భూమికి 10 కిలోమీట‌ర్ల లోతున భూకంపం సంభ‌వించిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. భూకంపం కార‌ణంగా ఫుకుషిమాలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల‌కు ఏమైనా న‌ష్టం వాటిల్లిందేమోన‌ని టోక్యో ఎలక్ట్రిక్ ప‌వ‌ర్ కంపెనీ ప‌రిశీలిస్తోంది. మార్చి 2011లో జ‌పాన్‌ను సునామీ కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. జ‌పాన్‌లో భూకంపాలు స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంభ‌వించే భూకంపాల్లో 20శాతం ఇక్క‌డే ఏర్పడుతుండ‌డం గ‌మ‌నార్హం.

మార్చి 2011లో 9.0 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. జ‌పాన్ చ‌రిత్ర‌లో ఇదే అతి భ‌యంక‌ర‌మైన భూకంపం. ఈ భూకంపం స‌మ‌యంలోనే ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ధ్వంస‌మైంది. ప్రాణ‌, ఆస్తిన‌ష్టంపై ఇప్ప‌టి వర‌కు ఎటువంటి స‌మాచారం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Japan  earthquake  6.9 magnitude  Tsunami Alert  

Other Articles