రెండు ఆర్టీసీ బస్సుల్లో మంటలు.. కిటీకీల నుంచి తప్పించుకున్నారు | Two RTC Buses caught fire in Andhra Pradesh

Two rtc buses caught fire in andhra pradesh

RTC Bus Fire Accident, APSRTC fire accident, Bus Accident, Bus caught fire, Andhra Pradesh Bus FIre Accident, RTC BUS accident

Two RTC Buses caught fire in Andhra Pradesh, Passengers were Safe.

ఏపీ ఆర్టీసీ బస్సుల్లో అగ్గి.. అంతా సేఫ్

Posted: 11/15/2016 08:00 AM IST
Two rtc buses caught fire in andhra pradesh

నవ్యాంధ్రలో ఈ ఉదయం ఘోర ప్రమాదాలు తప్పాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఆర్టీసీ బస్సులు తగలబడిపోయాయి. అయితే ప్రమాదంలో నష్టం వాటిల్లకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మంగళవారం ఉదయం కడప నుంచి కర్నూలు వెళ్తున్న కడప డిపోకు చెందిన బస్సులో ఆళ్లగడ్డ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనలో స్పల్ప గాయాలపాలైన ఓ ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక మరో ఘటన తూర్పు గోదావరి జిల్లా శంకవరం మండలం కత్తిపూడి వద్ద చోటు చేసుకుంది. కాకినాడ నుంచి పాడేరు వెళ్తున్న పాడేరు డిపో బస్సు కత్తిపూడి వద్దకు రాగానే ఇంజిన్ నుంచి పొగలు వెలువడ్డాయి. ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కిటికీల గుండా కిందికి దూకి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో అంతా క్షేమంగా బయటపడ్డారు. కాగా, ఇప్పటిదాకా కేవలం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు చూసిన వారంతా, ఆర్టీసీ బస్సులు కూడా తగలబడిపోతుండటంతో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రమాదాలపై సమీక్ష చేసిన ఆర్టీసీ ఎండీ నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APSRTC Buses  Fire Accident  

Other Articles