ప్రజలకు ఎస్‌బీఐ మరో ఆఫర్.. ఏటీఎంలలో ఆ నోట్లు కూడా.. | SBI dispense Rs 50-20 notes soon.

Sbi brings cheer during cash chaos

SBI Chief Arundhati Bhattacharya, State Bank of India, Arundhati Bhattacharya, 20 and 50 rupees notes in ATM, Indian ATMs, SBI ATM, New Notes in SBI ATM, Old notes in SBI ATM, SBI ATMs, Demonetisation SBI, Free Parking at Airport

Demonetisation effect, SBI Chief Arundhati Bhattacharya announced Will soon dispense Rs 20, Rs 50 notes ithrough ATMs to help public. and Central announced free parking at Airports.

ప్రజలకు ఎస్‌బీఐ మరో బంఫరాఫర్

Posted: 11/15/2016 08:31 AM IST
Sbi brings cheer during cash chaos

వారం నుంచి దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేదు. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు బారులు తీరుతున్న సీన్లు దర్శనమిస్తున్నాయి. స్వాగతించే నిర్ణయం అయినప్పటికీ, చిల్లర చిక్కులు ఇంకా వీడటం లేదు. 500 నోట్లు ఇంకా చాలా చోట్ల అందుబాటులోకి రాకపోవటం, ఇస్తున్న 2000 నోట్లకి చిల్లర ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో కరెన్సీ కష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే పూర్తిగా వంద నోట్లతోనే కాస్త ఊరట కలిగిస్తున్న ఎస్‌బీఐ మరో శుభవార్త అందజేసింది. ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి రూ.2000, రూ.500, రూ.100 నోట్లే కాదు.. రూ.20, రూ.50 నోట్లు కూడా తీసుకోవచ్చు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎస్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఓ ప్రకటనలో తెలిపారు.

ఎస్‌బీఐ ఏటీఎంలలో రూ.20, రూ.50 నోట్లు కూడా ప్రవేశపెడతామని, అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని ఆమె వివరించారు. ఇప్పటి వరకు ఇంత తక్కువ విలువైన కరెన్సీని ఏటీఎంలలో పెట్టలేదని పేర్కొన్నారు. చిన్న నోట్లు దొరక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరగా చిన్న నోట్లను ఏటీఎంలలో ఉంచాలని భావిస్తున్న సంస్థ ఏటీఎంల వద్ద రద్దీ తగ్గిన వెంటనే ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది.

ఇక ఏటీఎంల ద్వారా జరిపే లావాదేవీలపై డిసెంబరు 30 వరకు ఎటువంటి చార్జీలను వసూలు చేసేది లేదని ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఇది సేవింగ్స్ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని, డెబిట్ కార్డులపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. తమ బ్యాంకులతోపాటు ఇతర బ్యాంకుల్లో నెలలో ఎన్నిసార్లు అయినా లావాదేవీలు చేసుకోవచ్చని, పరిమితి లేదని, చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది.

ప్రస్తుతం సొంతబ్యాంకు ఏటీఎం నుంచి నెలకు ఐదుసార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడుసార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి నెలకు రూ.20 చొప్పున వసూలు చేస్తారు. ప్రస్తుతం పెద్ద నోట్లు రద్దు చేయడం, కొత్త నోట్లు పొందడానికి పరిమితులు విధించడంతో డెబిట్ కార్డును పలుమార్లు ఉపయోగించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రిజర్వ్ బ్యాంకు డెబిట్ కార్డు వినియోగంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఫ్రీ పార్కింగ్...
ప్రజల చిల్లర ఇక్కట్లను గుర్తించిన కేంద్రం ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా పాత నోట్ల గడుపు మరో పదిరోజులు పెంచిన విషయం తెలిసిందే. అంతేకాదు టోల్ టాక్స్ రద్దును మరికొన్ని రోజులపాటు పొడిగించింది కూడా. ఇక ఇప్పుడు విమానాశ్రయాల వద్ద పార్కింగ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు అంటే వచ్చే సోమవారం (నవంబర్ 21) వరకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎలాంటి పార్కింగ్ వసూలు చేయరని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  SBI  20 and 50 rupees notes  ATMs  

Other Articles