రాజధానిలో మద్యం ప్రియులకు పండగే.. పండగ.. Liquor truck overturns, brings cheers to passersby

Liquor truck overturns brings cheers to passersby

truck, overturned, loot, liquor, Chirag Dilli liquor bottles loot, liquor truck, south delhi, boozers get liquor free,

A mini-truckload of liquor bottles disappeared in minutes as men hurriedly filled their pockets and even helmets with quart bottles — those wearing jackets were luckier.

రాజధానిలో మద్యం ప్రియులకు పండగే.. పండగ..

Posted: 11/08/2016 09:12 AM IST
Liquor truck overturns brings cheers to passersby

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ప్రియులకు పండగ వాతావరణం నెలకొంది. ఆగ, మగ అన్న తేడా లేకుండా ఢిల్లీవాసులు మద్యాన్ని సీసాలు సీసాలు తీసుకెళ్తున్నారు. ఫ్రీగా మద్యం దొరికితే ఇంకేముంది.. పోటీ పడి మరీ మద్యాన్ని తీసుకెళ్లారు. ఈ వార్త దవాణంలో వ్యాపిండంతో కొద్ది సేపట్లోనే అక్కడకు చేరుకున్న స్థానికులు తోసుకుని మరీ మద్యం సీసాలను తీసుకెళ్లారు. ఇంతకీ అక్కడ ఫ్రీగా మధ్యం ఎలా లభించింది..? ఎవరు ఇచ్చారు..? అక్కడ ఎన్నికలు కూడా లేవుగా అంటారా..?
 
మ్యాటర్ లోకి ఎంటరైతే... హరియాణాలోని ఝజ్జర్ ప్రాంతం నుంచి మద్యం లోడుతో వచ్చిన మినీ ట్రక్కు డివైడర్‌ను ఢీకొని తిరగబడింది. లోపల సరుకును జాగ్రత్తగా కాపాడాల్సిన డ్రైవర్.. ట్రక్కు తిరగబడటంతో అక్కడి నుంచి పారిపోయాడు. దాంతో జనం సీసాలు తీసుకుని వెళ్లిపోయారు. బహుశా హరియాణాలో మాత్రమే అమ్మాల్సిన మద్యాన్ని అక్రమంగా ఢిల్లీకి తీసుకొచ్చి ఉంటారని, అందుకే డ్రైవర్ పారిపోయాడేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రక్కు తిరగబడటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని సీసాలు పగిలిపోయి మద్యం అక్కడ ప్రవహించడంతో భాదను వ్యక్తం చేసిన మందుబాబులు తమకు దక్కింది తీసుకున్నారు.

ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఫ్లైఓవర్ ప్రాంతంలో ఓ మద్యం ట్రక్కు తిరగబడింది. దాంతో దాంట్లో రవాణా చేస్తున్న మద్యం సిసాలు దొర్లి కిందపడ్డాయి. ఎవరికి దొరికిన మద్యం సీసాలను వారు ఎత్తుకెళ్లేందుకు పోటీపడ్డారు. దీంతో మందుబాబులు వాటిని తీసుకెళ్లి పండగ చేసుకున్నారు. ఈ విషయం సమీప కాలనీల వాళ్లకు తెలిసి వాళ్లు కూడా వచ్చేశారు. కొందరు కార్లలో వచ్చినవాళ్లయితే రెండు మూడు బాక్సులు తీసుకెళ్లిపోయారు.

కొద్ది నిమిషాల వ్యవధిలోనే అక్కడున్న మొత్తం స్టాకు అంతా మాయమైపోయింది. దేశంలో ఫ్రీగా వచ్చే మద్యానికి ఎంత గిరాకీ వుంటుందో ఈ ఘటన సాక్షిగా మారింది. నెహ్రూ పార్కు వైపు నుంచి ఎయిర్‌పోర్టు వైపు ఈ ట్రక్కు వెళ్తోందని పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లాల్సిన బాగా ఖరీదైన విస్కీ అందులో ఉన్నట్లు ప్రచారం జరగడంతో జనం తండోపతండాలుగా వచ్చి పండగ చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : liquor truck  south delhi  boozers get liquor free  

Other Articles