వికాస్ యాత్రలో కొట్టుకున్న బాబాయ్-అబ్బాయ్ వర్గాలుSamajwadi Party workers clash at venue of Akhilesh Yadav’s ‘Vikas Rath Yatra’

Samajwadi party workers clash at venue of akhilesh yadav s vikas rath yatra

samajwadi party, akhilesh yadav, vikas rath yatra, akhilesh vikas rath yatra, mulayam singh yadav, shivpal yadav, amar singh, sp war, up elections, uttar pradsesh assembly elections

Samajwadi Party workers clashed at the venue where CM Akhilesh Yadav launched his ‘Vikas Rath Yatra’. Party supremo Mulayam Singh Yadav and state president Shivpal Yadav were in attendance.

ITEMVIDEOS: వికాస్ యాత్రలో కొట్టుకున్న బాబాయ్-అబ్బాయ్ వర్గాలు

Posted: 11/03/2016 11:06 AM IST
Samajwadi party workers clash at venue of akhilesh yadav s vikas rath yatra

మరో మూడు మాసాల వ్యవధిలో రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు పైచేయి సాధిస్తారన్న అసక్తి యావత్ దేశప్రజలలో నెలకోన్న నేపథ్యంలో మళ్లీ అధికారాన్ని దక్కించుకుని తమ సత్తా చాటాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. గత కోంతకాలంగా ఇంటిపోరుతో నానా హైరానా పడినా.. ఎట్టకేలకు ప్రజలముందుకు వెళ్లాలని నిర్ణయించారు. తన పాలనపై ప్రజల్లోనే తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభించిన వికాస్ రథయాత్రకు లక్నో వేదికైంది.

గత కొన్ని నెలలుగా రగులుతున్న రగులుతున్న ఇంటిపోరుతో ఉక్కిరిబిక్కిరి అయినా.. ఎట్టకేలకు ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిందన్న సంకేతాలు బయటకు వచ్చాయి. దీంతో అఖిలేష్ ప్రచారపర్వంతో ఎన్నికల సమరశంఖాన్ని పూరించేందుకు లక్నోలో ర్యాలీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ర్యాలీలో అబ్బాయ్ బాబాయ్ వర్గాలకు చెందిన కార్యకర్తలు బాహాభాహీకి దిగారు. నానా హైరానా చేశారు. కార్యకర్తలు పరస్పర దాడులు, ప్రతిదాడులతో ర్యాలీలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగలోకి దిగిన పోలీసులు పరిస్తితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికంగానే శ్రమించాల్సి వచ్చింది.

లక్నో వేదికగా ఇవాళ ప్రారంభమైన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రథయాత్రకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ ర్యాలీ విజయవంతం అయితే తమ నాయకుడికి ఉనికికే ప్రమాదం పోంచివుంటుందన్న అందోళనతో శివపాల్ యాదవ్ వర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు అఖిలేష్ వర్గ కార్యకర్తలతో దాడులకు దిగారు. రెండు వర్గాల కార్యకర్తలు కర్రలతో ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు వేదికపై వున్న అఖిలేష్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇలాంటి ఘటనలు సహజం.. ఇది చాలా చిన్న ఘటన అని అయన పేర్కోన్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. తమ లాఠీలకు కూడా పనికల్పించాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles