మిషెల్లీకి.. హిల్లరీ బంఫర్ ఆఫర్.. Hillary Clinton says open to having Michelle Obama in Cabinet

Hillary clinton says open to having michelle obama in cabinet

Barack Obama, hillary clinton, donald Trump, michelle obama, US presidential elections, President Barack Obama,Jimmy Kimmel Live,US presidential elections,US elections 2016

Democratic presidential candidate Hillary Clinton has said she is open to having First Lady Michelle Obama in her Cabinet if she wins the November 8 polls.

మిషెల్లీకి.. హిల్లరీ బంఫర్ ఆఫర్..

Posted: 11/01/2016 02:53 PM IST
Hillary clinton says open to having michelle obama in cabinet

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాను మళ్లీ అమెరికా అధ్యక్ష బాధ్యతలను చేపట్టే అవకాశం వుండివుంటే.. అందకు తాను మొగ్గితే తన భార్య మిషెల్లీ తనకు విడాకులిస్తారని చమత్కరించినా.. లేక తన భార్యకు రాజకీయాలంటే పడవని, అమె భవిష్యత్తులో ఎప్పుడూ రాజకీయాల్లోకి రాదని వ్యాఖ్యానించిన నేపథ్యాన్ని తెలుసుకునే ఏమో తెలియదు కానీ విషెల్లీ ఓబామాకు ఏకంగా బంఫర్ ఆఫర్ ప్రకటించారు అమెరికా డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్.

అదేంటారా..? నవంబర్ 8న జరిగే ఎన్నికలలో తాను గెలిస్తే.. తన ప్రభుత్వ మంత్రివర్గంలోకి మిషెల్లీ ఒబామాను తీసుకుంటానని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యా వంటి పలు సమస్యలపై మిచెల్లీ ఎంతో అవగాహనతో ఉన్నారని, వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయాలని మిచెల్లీ కోరుకుంటున్నట్టు హిల్లరీ పేర్కొన్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని విన్స్టన్-సాలెంలో తామిద్దరూ భేటీ అయిన సందర్భంలో ఈ విషయాలపై చర్చించినట్టు తెలిపారు. తనకు ఉత్తమమైన భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాని, మిచెల్లీని మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకోవాలని ఆశిస్తున్నట్టు క్లింటన్ ఓ టీవీ చానెల్కు చెప్పారు.
 
ఒకవేళ నవంబర్ 8న జరిగే సాధారణ ఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే, అమెరికాకు ఎన్నికైన మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఆమె పేరొందనున్నారు. మొదటిమహిళగా ఆమె ఎంతో ఆదర్శప్రాయురాలని, ఆ బాధ్యత ఎలా ఉంటుందో తనకు తెలుసని క్లింటన్ అన్నారు. మిచెల్లీ తనకందించిన ధైర్య, సహాకారాలను తాను అభినందిస్తున్నానని క్లింటన్ చెప్పారు. క్యాంపెయిన్ తుదిదశలో క్లింటన్ ప్రత్యామ్నాయంగా మిచెల్లీ కొన్ని ర్యాలీలో పాల్గొన్నారు. హిల్లరీకి అమె చేస్తున్న ప్రచారం కూడా బాగానే కలసివస్తున్న నేపథ్యంలో అమె ఈ నిర్ణయానికి వచ్చివుండవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  hillary clinton  donald Trump  michelle obama  US presidential elections  

Other Articles