బీహార్ లోలాగే మోదీ కోసం పెద్ద స్కెచ్ | Prashant Kishor to be Roped in for a UP Mahagathbandhan

Prashant kishor to be roped in for a up mahagathbandhan

Mahagathbandhan, Prashant Kishor Mahagathbandhan, Prashant Kishor master plan for UP elections, Prashant Kishor follows Bihar formula for UP

Prashant Kishor to be Roped in for a UP Mahagathbandhan for secular alliance against BJP.

ప్రశాంత్ యూపీ మాస్టర్ ఫ్లాన్-మహాఘటబంధన్

Posted: 10/28/2016 04:19 PM IST
Prashant kishor to be roped in for a up mahagathbandhan

యూపీలో కాంగ్రెస్ అధికారం కోసం కృషి చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమాజ్ వాదీ పార్టీ, జేడీ(యూ) నేతలతో చర్చలు సాగించటం చర్చనీయాంశంగా మారింది. మహాకూటమి దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీహార్ ఫార్ములానే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ వాడాలని ప్రశాంత్ ఫ్లాన్ గా స్పష్టం అవుతోంది.

యూపీలో తిరిగి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఇప్పుడు సెక్యులర్ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా వివిధ పార్టీల కూటమిని 'మహాఘటబంధన్' పేరిట తయారు చేయాలన్నదే ఆయన లక్ష్యమని తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్, జేడీ (యూ)కు చెందిన కేసీ త్యాగీలతో ప్రశాంత్ సమావేశం కావడంతో 'మహాఘటబంధన్' వార్తలకు బలం చేకూరుతోంది.

ములాయం సింగ్ ఆదేశాల మేరకు పొత్తు అవకాశాలను పరిశీలించేందుకు ఢిల్లీకి వచ్చిన శివపాల్ యాదవ్, కేసీ త్యాగితో సమావేశం తరువాత జేడీ (యూ) చీఫ్ శరద్ యాదవ్ తోనూ చర్చలు జరిపారు. ఆపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ సుప్రీమో లాలూప్రసాద్ యాదవ్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ లతో టెలిఫోన్ సంభాషణలు జరిపినట్టు తెలుస్తోంది.

దీంతో యూపీలో మహా కూటమి ఏర్పాటు దిశగా సమాజ్ వాదీ పార్టీ నడుస్తున్నట్టు స్పష్టమవుతుండగా, అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తెచ్చి విజయ తీరాలకు చేర్చే వ్యూహాల రూపకల్పన, వాటి అమలు బాధ్యత ప్రశాంత్ కిశోర్ తన భుజాలపై వేసుకున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP elections  Prashant Kishor  Mahagathbandhan  

Other Articles