ఏసుక్రీసు సమాధిలో ఉన్న వస్తువులేంటి? | Jesus Christ tomb open for the first time in centuries

Jesus christ tomb open for the first time in centuries

Jesus Christ tomb open, Jesus tomb open, Jesus tomb location, Jesus Christ news, Jesus Christ real tomb, Jesus Christ tomb location, Jerusalem Jesus tomb

Restorers uncover the slab that held the body of Jesus Christ for the first time in centuries.

జీసస్ సమాధిని ఇప్పుడెందుకు ఓపెన్ చేశారంటే...

Posted: 10/28/2016 12:15 PM IST
Jesus christ tomb open for the first time in centuries

లోక సంరక్షకుడు ఏసుక్రీస్తు సమాధిని చరిత్రలో తొలిసారి తెలిచారు. పాత జరూసలేంలో ఉన్న పురాతన సెపల్ ర్చే చర్చిలో జీసస్ సమాధిపై ఉన్న చలువరాతిని తొలగించారు. ఈ విషయాన్ని అన్ని ప్రముఖ పత్రికలు దృవపరిచాయి. ఏసు సమాది ఉన్న ఈ ప్రాంతంలో ఓ పెద్ద చర్చిని నిర్మించారు. దాని మధ్యలో సమాధి చుట్టూ ఓ చిన్న నిర్మాణం ఉంది. దీన్నే 'ఎడిక్యుల్' అంటారు. ఈ నిర్మాణం చాలా అందంగా ఉంటుంది.

అయితే, అక్కడ గతంలో ఓ సారి అగ్నిప్రమాదం సంభవిస్తే 1808, 1810 మధ్య దాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం చర్చిని మరోసారి పునరుద్ధరిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే, సమాధిపై ఉన్న చలువరాతిని... చర్చి మతపెద్దల సమక్షంలో అతి జాగ్రత్తగా పరిశోధకులు తొలగించారు. క్రీస్తును సమాధి చేసిన తర్వాత, క్రీ.శ.1555 నుంచి అత్యంత పవిత్రమైన ఈ చలువరాతిని ఏనాడు కదపలేదు.

ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కియాలజిస్టు ఫ్రెడ్రిక్ హైబర్ట్ మాట్లాడుతూ "సమాధి పైభాగాన ఉన్న చలువరాతిని తొలగించాం. దీని కిందే క్రీస్తును ఉంచారు. క్రీస్తు సమాధిపై ఉన్న చలువరాతిని ఇప్పుడు అందరం చూడగలుగుతున్నాం. రాతి కింద ఉన్న వస్తువులను చూసి మేము ఆశ్చర్యపోయాం. సుదీర్ఘకాలంగా జరిగిన విశ్లేషణల అనంతరం చలువరాతిని తొలగించాం", అని తెలిపారు. అయితే అందులో ఉన్న వస్తువలేంటో, ఆ అద్భుతం ఏంటో చెప్పేందుకు ఆయన నిరాకరించాడు.

గతంలో నేషనల్ జియోగ్రఫీ చానెల్ తో సహా చాలా మీడియా సంస్థలు ఏసు సమాధిపై పరిశోధనలు చేసేందుకు అనుమతులు కోరాయి. అయితే అలాంటి చర్యలకు తాము ఏనాడూ సహకరించమని చర్చి నిర్వాహకులు తేల్చి చెప్పేశారు.

Jesus real tomb

tomb of Jesus open

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jesus Christ  Jerusalem  tomb  open  

Other Articles