రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పవర్ పంచాయితీ power struggle to rock telangana and andhra pradesh soon

Power struggle to rock telangana and andhra pradesh soon

AP Genco, SRPC, ultimatum, Telangana, Transco, prabhakar rao, andhrapradesh, vijayanand, debts, recovery, power allotments, state bifurcation, power production

IT seems to be an another power struggle to rock in between two telugu states Andhra pradesh and telangana soon as srpc threatens to stop power supply to Telangana

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పవర్ పంచాయితీ

Posted: 10/26/2016 01:39 PM IST
Power struggle to rock telangana and andhra pradesh soon

ఉభయ తెలుగు రాష్టాల మధ్య మళ్లీ పవర్ పంచాయితీ తలెత్తే అవకాశాలు వున్నాయి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణ నీటి విషయమై సాగుతున్న వివాదానికి తోడుగా పవర్ పంచాయితీ కూడా జతకలవనుంది. తెలంగాణకు కేటాయించాల్సిన కృష్ణ బేసిన్ నుంచి ఉత్పత్తవుతున్న విద్యుత్ ను కేటాయించలేదని తెలంగాణ సర్కార్ గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పుటు చెరింది. ఈ క్రమంలో కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందాన్ని కుదిర్చారు. అయితే ఆ విద్యుత్ కు సంబంధించిన బకాయిలు తెలంగాణ ప్రభుత్వం తీర్చకపోవడంతో ఇప్పుడదే తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీకి కారణం కానుంది.

బకాయిలు చెల్లించని పక్షంలో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఏపీ జెన్‌కో అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించిన రూ.4,282 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించకపోతే రాష్ట్రానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని తేల్చి చెప్పింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జెన్‌కో విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ కేటాయింపులు చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి ఏపీకి 46.11 శాతం.. ఏపీలోని ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 53.11 శాతం విద్యుత్ సరఫరా జరుగుతోంది. విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకు 450-300 మెగావాట్ల విద్యుత్ అదనంగా సరఫరా జరుగుతోంది.

పరస్పరం చెల్లించుకోవాల్సిన విద్యుత్ బిల్లులను సర్దుబాటు చేసిన తర్వాత తమ రాష్ట్రానికి రూ. 4,282 కోట్ల బిల్లులను తెలంగాణ చెల్లించాల్సి ఉందని ఏపీ అధికారులు ఎస్‌ఆర్‌పీసీలో వాదించారు. ఏపీ వాదనతో విబేధించిన తెలంగాణ అధికారులు బిల్లుల సర్దుబాటు తర్వాత ఏపీ నుంచే తమ రాష్ట్రానికి రూ.2,406 కోట్లు రావాలని తేల్చి చెప్పారు. దీంతో మరోమారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పవర్ పంచాయితీకి తెరలేవనుందిని తెలలుస్తుంది.

 ఏపీ నుంచి యూనిట్ రూ.5కు పైగా చెల్లించి విద్యుత్ కొంటూ తిరిగి ఆ రాష్ట్రానికి రూ.4కు యూనిట్ చొప్పున ఇస్తున్నాం. ఏపీ నుంచి అదనంగా 300 మెగావాట్ల మాత్రమే వస్తోంది. ఆపేస్తే మాకు లాభమేనని తెలంగాణ ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొన్నాయి. పరస్పర విద్యుత్ పంపకాలకు సంబంధించి ఏపీ అధికారులు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారన్నారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్ నుంచి వేరుపడిన కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన ఆర్‌ఈసీ రుణ  బకాయిలు, ఏపీ పెన్షనర్లకు చెల్లించిన పెన్షన్ల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉందన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిలు, పెన్షన్లు, రుణాలను సర్దుబాటు చేసిన తర్వాత ఏపీ నుంచితెలంగాణకు రూ.2,406 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Genco  SRPC  Telangana  Transco  prabhakar rao  andhrapradesh  vijayanand  debts  recovery  power allotments  

Other Articles