హరీష్ కీ బొమ్మ కి కోదండరాం కౌంటర్ | Prof Kodandaram counter to Harish Rao on Congress Key comments

I am not congress key prof kodandaram to harish rao

Prof Kodandaram counter to Harish Rao on Congress Key, Kodandaram Not Congress Key, Prof Kodandaram satires to Harish Rao, I am not Congress Key Prof Kodandaram, Kodandaram to Harish Rao, Congress Agenda not Kodandaram, Kodandaram versus Harish Rao

Prof Kodandaram counter to Harish Rao on Congress Key comments.

హరీష్ ‘కీ’ బొమ్మ కామెంట్లపై కోదండరామ్ సార్

Posted: 10/25/2016 03:00 PM IST
I am not congress key prof kodandaram to harish rao

తెలంగాణ సీఎం కేసీఆర్ కి, తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మధ్య పెరుగుతున్న రాను రాను అగాథం మరీ పెరిగిపోతుంది. రైతులకు మద్ధతుగా ఈ మధ్య కోదండరాం చేసిన వ్యాఖ్యలతో హర్టయిన తెలంగాణ మంత్రి హరీష్ రావు కాస్త కటువుగానే స్పందించాడు. జేఏసీ నేతగా పొందిన గౌరవాన్ని తాజా వ్యాఖ్యలతో కోదండరాం కోల్పోతున్నారని, ప్రతిపక్షం చేతిలో ఆయన పావుగా మారారని తీవ్ర ఆరోపణలు చేసాడు. కోదండరాం కాంగ్రెస్ పార్టీ అజెండాలో నడుస్తున్నారన్నారు. అసలు కోదండరాం ఎవరి కోసం దీక్షలు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.

ఓ వైపు ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ, మరోవైపు రైతుల సమస్యల కోసం దీక్ష ఎలా చేస్తారో చెప్పాలన్నారు.మల్లన్నసాగర్‌, పాలమూరు ప్రాజెక్ట్‌ల విషయంలో రైతులకు నష్టం కలిగించేలా కోదండరాం వ్యవహరించారన్నారు. ప్రతిపక్షాలు దీక్షలు చేయడం సహజం కానీ కోదండరాం లాంటివారు దీక్షలు చేయడం సరికాదన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలపై కోదంరాం కూడా కౌంటర్ ఇచ్చాడు. కాంగ్రెస్ అజెండాను అమలు చేస్తూ, రైతు దీక్షకు దిగారంటూ హరీష్ రావు చేసిన కామెంట్లను తప్పుబట్టాడు. మెదక్ లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... తనను వెనుక నుంచి ఎవరూ నడిపించడం లేదని తెలిపాడు. రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని... సాటి మనిషిగా తాను స్పందిస్తున్నానని చెప్పాడు.

మంచి, చెడులను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. తాను మాట్లాడిన మాటల్లో తప్పుంటే చెప్పండి, సరిచేసుకుంటా అని అన్నారు. టీఆర్ఎస్ నేతలు తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. టీవీల్లో వచ్చే రాజకీయ చర్చల్లో కూడా... ఎదుటి వారిని దుమ్మెత్తి పోసే సంస్కృతి మంచిది కాదని కోదండరామ్ సూచించారు.

రైతుకు అన్ని విధాలుగా అవమానం జరుగుతోందని మాత్రమే తాను మాట్లాడానని, 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారని, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలస్తంభమన్నారు. వ్యవసాయం బాగుంటేనే వ్యాపారాలు నడుస్తాయని మాత్రమే తాను చెప్పానని, అందుకు అవసరమైన చట్టాలు(ఆహార భద్రత చట్టం) చేయాలని మాత్రమే తాను సూచించానని వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prof. Kodandaram  Harish Rao  Not Congress Key  

Other Articles